జ్యూస్‌లో నిద్రమాత్రలు.. చున్నీతో ఉరి…
1 min read
AABNEWS : కట్టుకున్న భార్యను కడతేర్చిన కర్కోటకుడు పళ్లైన 2 నెలలకే ఘాతుకం
ఆత్మహత్యగా చిత్రీకరణ తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భార్యను ఓ వ్యక్తి హత్య చేసి అడ్డుతొలగించుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది. జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపి తాగించి.. స్పృహ కోల్పోయిన తర్వాత చున్నీతో ఉరేసి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రుపాలెం మండలంలోని అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన లక్కిరెడ్డి నవ్యారెడ్డి(22)కి అదే మండలంలోని పెగళ్లపాడు గ్రామానికి చెందిన మేనమామ కొడుకు యరమల నాగశేషురెడ్డితో 2020 డిసెంబర్ 9న వివాహమైంది. ఈ నెల 3న కాలేజీకి వెళ్లిన తన భార్య అదృశ్యమైందని నాగశేషురెడ్డి ఎర్రుపాలెం పోలీసులకు ఫిర్యా దు చేశాడు. నవ్యారెడ్డి ఇంటి నుంచి సత్తుపల్లి కాలేజీ వరకు భర్త నాగశేషురెడ్డితోనే బైక్‌పై వెళ్లినట్టు ఆ మార్గంలో ఉన్న సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించాం. అతడిపైనే అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా, వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యను తానే హతమార్చినట్టు అంగీకరించాడు.ఈ నెల 2న ఉదయం 11:30 నుంచి 12 గంటల మధ్యలో పెగళ్లపాడు నుంచి బైక్‌పై ఎక్కించుకొని పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి వద్ద ఉన్న కుక్కలగుట్టకు తీసుకెళ్లాడు. తొలుత కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి, స్పృహ కోల్పోయాక మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మృతురాలి సెల్‌ఫోన్ నుంచి ఆమె తండ్రికి మేసేజ్ పంపించాడు. తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఏడీసీపీ మురళీధర్, వైరా ఏసీపీ సత్యనారాయణతోపాటు పోలీసులను ఘటనా స్థలికి తీసుకెళ్లి మృతదేహాన్ని చూపించాడు. నాగశేషురెడ్డి ముంబైలో ఉద్యోగం చేస్తుండగా, నవ్యారెడ్డి సత్తుపల్లి మండ లంగంగారంలోని సాయిస్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతుంది. కాగా పెగళ్లపాడులో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది.
252 Total Views, 2 Views Today