February 24, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఛేరిక

1 min read

ఈరోజు గ్రేటర్ వరంగల్ ముప్పై మూడు వ డివిజన్ కి సంబంధించిన దాదాపు యాభై కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీ మరియు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు స్థానిక కార్పోరేటర్ తొట్ల రాజు గారి మరియు రాజారపు స్వామి గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది.
టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన సీనియర్ నాయకులు నార్లగిరి రవిగారు దామెరుప్పల రవీందర్ గారు నార్లగిరి ఉప్పలయ్య గారు పైడిపాల యాదగిరి గారు బత్తిని సాయిలు గారు కొలిపాక రాములు గారు రేఖ సురేష్ గారు ఆరూరి ప్రభాకర్ నర్మేట రమేష్ కుమార్ గారు
జంగా రాఘవరెడ్డి గారి కామెంట్స్:
👉టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ ల ముందు అధికారంలోకి రాగానే పండించిన పంటకు గిట్టుబాటు ధర విద్యార్థులు చదువుకోడానికి ఫీజు రీయంబర్స్మెంట్ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాల అవకాశం ప్రతి కుటుంబం నుంచి ఎంత మంది వృద్ధులు ఉంటే అంత మందికి పింఛన్ ఇస్తానని హామీ ఇచ్చి
అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రం రాకూడదని వ్యతిరేకించిన లీడర్ లకు మంత్రి పదవులిచ్చి పోలీసు బృందంతో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తా ఉన్నది.
బిజెపి ప్రభుత్వ రైల్వే ఉద్యోగస్థులను ప్రైవేటీకరణ చేయడానికి సిద్దంగా వుంది.
*బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కలిసి ప్రజల పై మోసపూరితమైన రాజకీయం చేస్తున్నది.
*పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపడితే పోలీసు బృందంతో రైతులను చితకబాదించిన ఘనత బీజేపీ పార్టీది.
*ఇది గమనించి టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు ప్రతి ఒక్కరికీ స్వాగతం తెలియజేస్తున్నాను.
*కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టించింది.
*విద్యార్థులు చదువుకోవడానికి ఫీజు రీయంబర్స్మెంట్ సదుపాయం కల్పించింది.
*రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చింది.
*గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి పనులను చూసి మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గానీ బడుగు బలహీనవర్గాల అట్టడుగు సామాజిక ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మనం అందరం కలిసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసే విధంగా ప్రజాసమస్యలను పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కృషి చేయాలని తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు జక్కుల రమా రవీందర్ యాదవ్ గారు లింగం మౌనిక చరణ్ రెడ్డి గారు వస్కుల శంకర్ గారు
బిఎస్ఎఫ్ డైరెక్టర్ దువ్వ శ్రీకాంత్ గారు గ్రామ పార్టీ అధ్యక్షులు మాతంగి రవీందర్ గారు స్వామి డివిజన్ ప్రెసిడెంట్ రాజా రపు స్వామి సందెల విజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 120 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.