September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

టెన్త్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

1 min read

AAB NEWS:బుర్ర కిరణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో

TS SSC EXAMS 2020-21: విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే విధంగా విద్యాశాఖ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రధానాంశాలు:

పరీక్ష పేపర్ల సంఖ్య 11 నుంచి 6 కి తగ్గింపు యోచన..
పరీక్ష సమయం కూడా గంటన్నరగా కుదించే అవకాశం..
ప్రశ్న పత్రంలో కీలక మార్పుల దిశగా విద్యాశాఖ కసరత్తు
త్వరలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో రానున్న స్పష్టత.

ఎస్‌ఎస్‌సీ ఎగ్జామినేషన్‌ 2020-21
తెలంగాణ విద్యాశాఖ విద్యార్థుల సౌకర్యార్థం పలు అంశాలపై సుదీర్ఘంగా మేదోమథనం చేస్తోంది. కరోనా కారణంగా అస్తవ్యస్తంగా మారిన విద్యా వ్యవస్థను గాడిన పెట్టడమే కాకుండా.. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే విధంగా సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పదో తరగతిలో 70 శాతం మేరకే సిలబస్‌ను ఆన్‌లైన్‌లో బోధిస్తున్న స్కూళ్లు.. మిగిలిన 30 శాతాన్ని యాక్టివిటీ బేస్డ్‌ కార్యకలాపాలకు కేటాయిస్తున్నాయి.
ఇక పరీక్షల సంఖ్యను కూడా కుదించి.. పరీక్షా సమయాన్ని కూడా తగ్గించాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌/డిజిటల్‌ క్లాసులకు అనుగుణంగానే పదో తరగతి పరీక్షలను 11 నుంచి ఆరుకు తగ్గించే అవకాశాలను విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు చొప్పున.. సెకండ్‌ లాంగ్వేజీకి ఒక పేపర్‌ చొప్పున మొత్తం 11 పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

సబ్జెక్టుకు ఒక పేపరు:

ఈ విద్యా సంవత్సరం (2020-21)లో సబ్జెక్టుకు ఒక పేపరు చొప్పున మొత్తం ఆరు పరీక్షలే నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక పరీక్షా సమయాన్ని కూడా రెండున్నర గంటలకు నుంచి గంటన్నరకు కుదించే అవకాశాలున్నాయి. అలాగే ప్రశ్నా పత్రంలో కూడా పలు మార్పులు జరిగే సూచనలున్నాయి.

 114 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.