AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

డా. సామల శశిధర్ రెడ్డి గారికి సన్మానం

1 min read

AABNEWS : అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సార్క్ నేషన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వారిచే డా. సామల శశిధర్ రెడ్డి గారికి సన్మానం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని అంబేద్కర్ భవన్ నందు జరిగిన సార్క్ నేషన్స్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అంతర్జాతీయ చైర్మన్ మరియు యు.కె లంగాణ హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ ప్రశాంత్ గడిపే గారు. మరియు అసోసియేషన్ తెలంగాణ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గారు. సమాజంలో యువతను ప్రోత్సహిస్తూ విద్యార్థులను మేధావులుగా తయారు చేస్తూ దేశంలో జరుగుతున్న అవినీతి అన్యాయాలపై అలాగే ప్రతి సమస్య పోరాడుతూ తన గళాన్ని వినిపిస్తున్న యువతకు ఐకాన్ గా ఆదర్శంగా నిలిచిన ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలంగాణ ప్రైవేట్ టీచింగ్ నాన్-టీచింగ్ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ సామల శశిధర్ రెడ్డి గారిని ఈరోజు” యువశక్తి” అవార్డుతో మరియు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. శశిధర్ రెడ్డి గారు నిస్వార్థంతో నిజాయితీగా ఉంటూ సమాజానికి చేస్తున్న సేవ చాలా గొప్పదని అంతేకాకుండా ఆయన తన 25 సంవత్సరాల వయసులోనే 2009లో భూపాలపల్లి శాసనసభ్యునిగా పోటీ చేసి యువతరానికి ఆదర్శంగా నిలిచారు మరియు సమాజం పట్ల ప్రజలకు యువతకు సందేశాన్ని ఇస్తూ మార్గదర్శకంగా నిలుస్తున్న శశిధర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు రాబోయే రోజుల్లో ఇలాంటి యువతే దేశానికి అవసరమని వారు పేర్కొన్నారు. అనంతరం శశిధర్ రెడ్డి మాట్లాడుతూ సార్క్ నేషన్స్ ఇంటర్నేషనల్ హ్యుమన్ రైట్స్ అసోసియేషన్ వారు నన్ను గుర్తించి నన్ను ఇంత గొప్పగా గౌరవించి నందుకు అసోసియేషన్ ఇంటర్నేషనల్ చైర్మన్ డాక్టర్ ప్రశాంత్ గారికి మరియు తెలంగాణ వైస్ చైర్మన్ మల్లికార్జున గారికి వరంగల్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సందీప్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవార్డు రావడం పట్ల నాకు మరింత బాధ్యత పెరిగిందని అందుకు తగిన విధంగా శ్రమిస్తాను అని రాబోయే రోజుల్లో మరింత బాధ్యతతో పని చేస్తానని వారు పేర్కొన్నారు….

 152 Total Views,  6 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.