డ్రైనేజిని మై మరిపిస్తున్న పుష్కర ఘాట్ ప్రధాన…
1 min read
AAB NEWS : బుర్ర కిరణ్ కుమార్ తెలంగాణ బ్యూరో కాళేశ్వరం:- జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా.మహాదేవపూర్ మండలం.కాళేశ్వరం లోని త్రివేణి సంగమ దేవాలయ సమీప అనుసంధాన ప్రధాన పుష్కర ఘాట్ రహదారి అని పెట్టింది పేరు. కాని పరిస్థితి మాత్రం అందుకు బిన్నంగా పశువుల దారి అనే విధంగా బురదస్త మయంతో సమీప గృహాల వారికి దుర్వాసన వెదజల్లు తున్న ఈ విదంగా రహదారికి కారకులైన హోటళ్ల యజమానులపై కాని చికెన్ సెంటర్ విక్రయాల వారిపై కాని గ్రామ పంచాయితీ అధికారులు పరిపాలికులు ఏవరూకూడా పట్టించుకునేవారు లేరనే స్థానికుల విమర్శ. కారణం బంధుత్వాలని సడలింప లేక మనకెందుకు అని నిర్లక్ష్యం చేయడమా సమీప రోడ్ గృహ వాసులు దర్శన రాకపోకల భక్తులు మండిపడుతున్నారు. పుణ్య కార్తీక మాసం నది స్నానాలు ఆచరించి కాలినడకన వచ్చే భక్తులకు వాహన రాకపోకలతో చెడు మురికి నీరు పడడంతో భక్తులు నిరుత్సాహానికి లోనై ఆవేశంతో ఈ రోడ్లు మురుగు నీరు ఇదేం పరిపాలన వ్యవస్థ అని ఆవేశం వెళ్లగక్కుతున్నారు. ఇకనైన ఇట్టి సమస్యలు గ్రహించి గ్రామ పంచాయితీ వారు హోటల్ యాజమాన్యం వారిని హెచ్చరించి చికెన్ సెంటర్ మాంస విక్రయాల వారికి ఇతర స్థలాలను కల్పించి అసం పూర్తి మరమ్మతు రోడ్ నిర్మాణం 66 ఫీట్లు పూర్తి చేసి స్థానిక ప్రజలకు వాహన దర్శన భక్తులకు సౌకర్య వంతంగా వసతులు ఏర్పరచాలని కోరుకుంటున్నారు.
42 Total Views, 2 Views Today