AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తృణధాన్యాలను ఆహారంలో చేర్చడం వల్ల చక్కని ఫలితం…

1 min read

AAB NEWS:తృణధాన్యాల (మిల్లెట్స్)తో మధుమేహం మాయమవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారు తమ ఆహారంలో క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల మధుమేహాన్ని నివారించవచ్చని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఆహారంలో తృణధాన్యాలను చేర్చడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగకుండా చూసుకోవచ్చని అధ్యయనకారులు తెలిపారు.ఇక్రిశాట్, జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)తోపాటు మరో ఐదు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు 11 దేశాలకు చెందిన 65 పరిశోధనా పత్రాలను విశ్లేషించిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. చిరుధాన్యాల ఆహారంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయి 12-15 శాతం వరకు తగ్గినట్టు గుర్తించారు.హెచ్‌బీఏ1సీ స్థాయి కూడా క్రమంగా తగ్గి ప్రీ డయాబెటిక్ నుంచి సాధారణ స్థాయికి చేరుకుంటారని అధ్యయనానికి నేతృత్వం వహించిన సీనియర్ పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ అనిత తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలు ‘ఫ్రంటైర్స్ ఇన్ న్యూట్రిషన్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

 108 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.