February 24, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తెలంగాణ రాష్ట్ర మహా సభ, విద్య సదస్సు…

1 min read

AABNEWS : MD Amjad Khan Adilabad District Stafer : గురువుల పాత్ర విద్యార్థుల జీవితంలో చాలా కీలకమైనది ఉట్నూర్ మండల కేంద్రం లో నిర్వహించిన ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర మహాసభ & విద్య సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చెర్మెన్ జనార్ధన్ రాథోడ్ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చెర్మెన్ గారు మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో గురువులది చాలా కీలకమైన పాత్ర మరియు గురువు స్థానం చాలా పెద్దది, విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దుతూ మరియు విద్యార్థుల భవిష్యత్తు లో గొప్ప స్థాయిలో ఉండాలని గురువుల పాత్ర చాలా గొప్పదని అన్నారు, అందుకోసం గురువులను గౌరవించాల్సిన అవసరం ఉందని జడ్పీ చెర్మెన్ గారన్నారు.ఉద్యోగుల సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే తమ వంతు పూర్తి సహాయ సహాకారాలు అందిస్తామని అన్నారు,తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ఉద్యోగుల ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా కృషి చేశారని వారన్నారు, ఉపాధ్యాయుల సమస్యలు అతి త్వరలో మన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తీరుస్తారని జడ్పీ చెర్మెన్ గారన్నారు అనంతరం కార్యక్రమంలో జిల్లా పరిషత్ చెర్మెన్ గారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో dccb చెర్మెన్ నాందేవ్ కాంలే గారు రాష్ట్ర అధ్యక్షుడు M. రామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దినేష్, జిల్లా అధ్యక్షుడు రాథోడ్ గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, తెలంగాణ అంబెడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దావుల రమేష్,. తదితరులు పాల్గొన్నారు.

 24 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.