September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తేదీ. 13.03.2021 రోజున KTK-8 గని కార్మికులకు కౌన్సిలింగ్

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి

తేదీ. 13.03.2021 (శనివారం) రోజున KTK-8 గనిలో గైర్హాజర్ అవుతున్న
ఉద్యోగుల కొరకై “గైర్హాజర్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని ఏరియా అధికార
ప్రతినిధి శ్రీ S. అనిల్ కుమార్ -PM గారు తెలిపారు. సింగరేణి సంస్థ లో ఉద్యోగం రావడం
ఎంతో అదృష్టమని అలాంటిది గైర్హాజరు తో సంస్థను నష్టపరుచవద్దని, అలాగే ఉద్యోగులు
తమ జీతాలను కోల్పోయి ఆర్థికంగా నష్ట పోవద్దని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సింగరేణి
సంస్థ తమ ఉద్యోగుల సంక్షేమం కోసం ఎన్నో సౌకర్యాలు, వసతులు (ఉచిత కరెంటు , ఉచిత
గ్యాస్ మరియు క్వార్టర్ ) కల్పించడం జరుగుతుందని ఇలాంటి సౌకర్యాలు ఏ కంపనీ లో
లేవని తెలిపారు. కావున ఉద్యోగులు గమనించి రెగ్యులర్ గా తమ విధులకు హాజరు కావలసిందిగా కోరారు. రేపు జరగబోయే కౌన్సిలింగ్ లో తరచూ గైర్హాజరు అవుతున్న KTR-8 గని ఉద్యోగులు 103 మంది పాల్గొంటున్నారని తెలిపారు. ఇట్టి కౌన్సిలింగ్ కార్యక్రమం గని మేనేజర్ గారి కార్యాలయం లో ఉదయం 10-00 గం.లకు జరుగుతుందని తెలిపారు.
గైర్హాజరు ఉద్యోగులు సకాలంలో హాజరు కావాలని సూచించారు.

 710 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.