AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తైపాక్షిక సేప్ట్ రివ్యూ అవగాహన సదస్సు

1 min read

AABNEWS:బుర్ర కిరణ్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి

తేదీ 15.07.2021 రోజున స్థానిక మైన్స్ రెస్కూ స్టేషన్ సమావేశం మందిరంలో ఎలక్ట్రికల్ సేఫ్టీ పై
ఆయా గనుల మేనేజర్లు, ఏజెంట్లు, ఇంజినీర్లు, ఎలెక్ట్రికల్ సుపర్వైజర్లు మరియు సేఫ్టీ ఆఫీసర్లతో
అవగాహన సదస్సును ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ లతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం శ్రీ బచ్చరవీందర్ –ASO గారి అద్యక్షతన నిర్వహించడం జరిగిందని ఏరియా అధికార ప్రతినిధి శ్రీ అజ్మీర తుకారాం – PM గారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా హైద్రాబాద్ సౌత్ సెంట్రల్ జోన్ నుండి శ్రీ పుట్ట రాజు – DMS
(ఎలక్ట్రికల్) గారు, శ్రీ మేరుగు రఘు – DDMS (ఎలక్ట్రికల్)గారు, శ్రీ గౌరవ్ లడ్డ
(ఎలక్ట్రికల్)గారు, శ్రీ భద్రేష్ కుమార్ దివ్య DDMS (ఎలక్ట్రికల్)గార్లు హాజరైనారు. తేదీ
14.07.2021 న భూపాలపల్లిలో గల KTK 1 ఇంక్లైన్, ఏరియా వర్క్ షాప్ మరియు KTK-6
ఇంక్లైన్ గనులను తనికి చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా తేదీ 16.07.2021 నుండి
జరగనున్న 16 వ తైపాక్షిక సేప్ట్ రివ్యూ మీటింగ్ సంధర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఈ
అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగందని తెలియజేశారు.
ఈ అవగాహన సదస్సునందు శ్రీ గౌరవ్ లడా గారు మాట్లాడుతూ- ఎలక్ట్రికల్ ఉపకరణములు
తగిన సామర్ధ్యము గలవి వాడాలని, విద్యుత్ వలన సంభవించే ప్రమాదాల గురించి తరచుగా సంభందిత E&M సిబ్బందికి తగిన సూచనలు చేయాలని సంభందిత అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో శ్రీ ఆర్ విజయ ప్రసాద్ – so to GM గారు, శ్రీ ఎన్ రామలింగం AGM (E&M)గారు, శ్రీ జాన్ ఆనంద్ – PO KTK OC2 గారు, ఆయా గనుల ఏజెంట్లు, మేనేజర్లు మరియు తదితరులు పాల్గొన్నారని ఆదికర ప్రతినిధి శ్రీ అజ్మీర తుకారాం -PM గారు
తెలియజేశారు.

 1,208 Total Views,  8 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.