దాన హృదయనేత
1 min read
AABNEWS:వరంగల్ ప్రతినిధి గైని ప్రవీణ్ కుమార్
స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం లోని గ్రంథాలయంకు స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో భౌతిక రసాయన శాస్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ధారణ సత్య ప్రకాష్ ఈరోజు సర్పంచ్ కి 150 పుస్తకాలను విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా సత్య ప్రకాష్ మాట్లాడుతూ జన్మస్థలం ఇప్పగూడెం కాబట్టి గ్రామంలోని యువత, విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలని ఉద్దేశంతో తన వద్ద ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ ,
ఇంగ్లీష్ గ్రామర్ ,చిన్న పిల్లలకు కథల పుస్తకాలతోపాటు , విద్యార్థులందరికీ అవసరమయ్యే పుస్తకాలను అందించడం జరిగిందని, పుస్తకాలను గ్రామంలోని విద్యార్థులు, యువత చదవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు
346 Total Views, 2 Views Today