September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ధర్మబిక్షం సేవలు ఆదర్శనీయం

1 min read

AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్



బొమ్మగాని ధర్మబిక్షం గౌడ్ గారి సేవలను మరువ లేనివని, నెట్ తరం వారిని ఆదర్శంగా తీసుకోవాలని…గౌడ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ అన్నారు. ధర్మబిక్షం గౌడ్ గారి 99 వ జయంతి కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ప్రభాకర్ గౌడ్ హాజరై …తన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ….. ధర్మభిక్షం తన విద్యార్థి దశ నుండి ఒక శాస్త్రీయ దృష్టిని అలవర్చుకోవడం, తాను ఆట,పాటల్లో ,చదువులో ముందునిలిచే వాడని అన్నారు. ధర్మభిక్షం అంటే ఒక దైర్యం, ఒక నమ్మకం.. తాను నీతి,నిజాయితీకి పెట్టింది పేరు. ఏనాడు తన కోసం,తన వాళ్లకు కాకుండా నిరంతరం ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప పోరాట యోధుడు ధర్మభిక్షం అని అన్నారు.
పాపన్న పోరాట స్ఫూర్తితో ధర్మభిక్షం గారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో, భూమి కోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం నైజం నిరంకుశ ,జాగీర్దార్,జమీందారుల అరాచకాలకు ఎదురొడ్డి,వారి అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసి,అలుపెరుగని పోరు సలిపిన వీరుడు ధర్మభిక్షం అని అన్నారు. ఆ సమయంలో కుల వృత్తిలపై జరుగుతున్న దాడులు,దౌర్జన్యాలను ఎదిరించి,వారికి అండగా నిలిచాడు. కార్మికులు అందరు ఏకం కావాలని, పిలుపు నిచ్చి కార్మిక సంఘాలను ఏర్పాటు చేసిన యోధుడు ధర్మభిక్షం అని అన్నారు.

గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్

 361 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.