AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఇంటి నుంచి అడవిలోకి…

1 min read

AABNEWS : అడవి అంటే అందరిలో ఎదో తెలియని భయం ఉంటుంది.ఏ జంతువు ఏ వైపు నుంచి దాడి చేస్తుందో.. ఏ విషపురుగు ఎక్కడ గాయపరుస్తుందో తెలియదు. కొంతమంది మహిళలు మాత్రం వాటిని లెక్క చేయకుండా అడవుల్లో ఆడ బెబ్బులుల్లా తిరుగుతున్నారు. వారే అటవీశాఖలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగినులు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేంత వరకు వారి జీవితం మొత్తం అడవిలోనే. చెట్లు, వాగులు, వంకలు, గుట్టలు, బండరాళ్ల మధ్యలోనే సాహసాలు చేస్తూ అటవీ సంపదను, జంతువులను రక్షించేందుకు మేము సైతం అంటూ ముందుకు సాగుతున్నారు. అడవిలోని వృక్షాలు.. వన్యప్రాణులు తమ నేస్తాలని, వాటి బాగోగులు చూసుకునే అవకాశం తమకు దక్కడం అదృష్టమని గర్విస్తున్నారు.

 111 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.