September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ…

1 min read

AAB NEWS : 71వ , రాజ్యాంగదినోత్సవ శుభసందర్భంగా భారత రాజ్యాంగపితామహుడు బోధిసత్వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం నిన్న 26 నవంబర్ నాడు సాయంత్రం మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు సామ రాజు , మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కార్యదర్శి బోప్పని నగేష్ గారి అధ్యక్షతన వారి స్వగ్రామం తోపుచర్ల గ్రామం మాడ్గులపల్లి మండలం నల్గొండ జిల్లాలో ఘనంగా జరిగింది ..

న్యాయవాది , మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తల్లమల్ల హసేన్ , మాల మహానాడు జాతీయ కమిటీ ఉపాధ్యక్షులు ముళ్ళగిరి కాంతయ్య , ప్రముఖ కవి వాగ్గేయకారుడు జయరాజ్ , నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కామెర్ల జానయ్య , కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ , మిర్యాలగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బి ఎల్ ఆర్ గారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు .
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గారు తల్లమల్ల హసేన్ మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవ శుభసందర్భంగా తోపుచర్ల గ్రామం లో గ్రామ ప్రజలందరూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకొనుటకు గ్రామ నడిబొడ్డులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆవిష్కరించడం హర్షణీయమని అన్నారు .
డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ డ్రాప్స్ కమిటీ అధ్యక్షులుగా , మిగతా రచనా కమిటీ సభ్యుల సహకారంతో ఎంతో శ్రమించి ప్రపంచంలోనే ఆదర్శమైన , అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు అని అన్నారు .
మన రాజ్యాంగంలో భూభాగంలో ఉద్భవించిన ప్రతి ప్రాణికి హక్కులను కల్పించి హక్కుల సాధన దిక్సూచిగా డాక్టర్ అంబేద్కర్ నిలిచారని అన్నారు .
విశిష్ట అతిథులుగా పాల్గొన్న మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షులు ముళ్ళగిరి కాంతయ్య , ప్రముఖ రచయిత , వాగ్గేయకారుడు జయరాజు నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షులు కామెర్ల జానయ్య మాట్లాడుతూ స్వేచ్ఛ , సమానత్వం , సౌభ్రాతృత్వం కోసం న్యాయ పోరాటాలు చేసిన బోధిసత్వ అంబేద్కర్ విగ్రహాలను ప్రజలందరూ కలిసి ప్రతి పట్టణ గ్రామాలలో ప్రతిష్టించాలని , రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును బడుగు బలహీన వర్గాల వారు సద్వినియోగం చేసుకొని రాజ్యాధికారం దిశగా పయనించాలని కోరినారు.
ప్రతి ఒక్కరు తమ బిడ్డలను ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదివించాలని కోరినారు .
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నలగొండ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ , సామాజికవేత్త డాక్టర్ జాడీ రాజు , మిర్యాలగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బి ఎల్ , కౌన్సిలర్ కోడి రెక్క విజయ్ కుమార్ , ఎం సి పి ఐ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వస్కుల మట్టయ్య , మాడుగులపల్లి జెడ్పిటిసి పుల్లెంల సైదులు , తోపుచర్ల గ్రామ సర్పంచి మంగ యాదగిరి , తోపుచర్ల ఎంపీటీసీ కత్తి కనకా రెడ్డి , రసూల్ , జానీ మియా , చింతమల్ల ఆనంద్ కుమార్ , మాల మహానాడు మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు ఎలిజాల ఏడుకొండలు , మాల మహానాడు రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ పూబ్బనీ రవి కుమార్ , మర్రి జోజి , మాల మహానాడు సూర్యాపేట జిల్లా కార్యదర్శి నామా వేణు, వల్లమల్ల ప్రకాష్ , కోరెక్క నరసయ్య, ఉపాధ్యాయులు అంజయ్య మాస్టర్ , నామ నాగయ్య , జై భీమ్ యూత్ అసోసియేషన్ సభ్యులు , గ్రామ ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నారు .

 129 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.