సాగర్ ఉపఎన్నికను టీఆర్ఎస్ కాంగ్రెస్ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి…
1 min read
AABNEWS : నల్గొండనిడమనూరు సాగర్ ఉప ఎన్నికను టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇరు పార్టీల నాయకులు గ్రా మాల్లో జోరుగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఎవరు ఏ పార్టీలోకి మారుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. కొందరైతే రోజుకో పార్టీ మారి, పూటకో కండువా కప్పుకుంటున్నారు. ఉదాహరణకు మండలంలోని ముప్పారం గ్రామానికి చెందిన కోరెక్క వీరయ్య అనే వార్డు మాజీ సభ్యుడు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకున్నాడు. మరుసటి రోజే గులాబీ కండువా కప్పుకున్నాడు.
62 Total Views, 3 Views Today