నాణ్యమైన ఆహారోత్పత్తి మానవాళికి అత్యవసరం.. ఉద్యానవన సాగులో రాష్ట్రాల మధ్య సహకారం ఉండాలన్న నిరంజన్‌రెడ్డి
1 min read
ప్రపంచంలో ఏ దేశమూ నాణ్యమైన ఆహారోత్పత్తిపై దృష్టి సారించడం లేదని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల కర్ణాటక పర్యటనలో భాగంగా బెంగుళూరు హెసరగట్ట ఐకార్ – ఐఐహెచ్ఆర్ పరిశోధనా కేంద్రంలో ప్రిన్స్ పల్ సైటింస్టులు, ముఖ్యులతో నిరంజన్‌రెడ్డి సమావేశం అయ్యారు.
నాణ్యమైన ఆహారోత్పత్తిపై దృష్టిసారిస్తే భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని నిరంజన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యాన సాగులో రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉండాలన్నారు. తెలంగాణ, కర్ణాటక నేలలు, వాతావరణ పరిస్థితులు దాదాపు సమానంగా ఉంటాయని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ రైతులకు అత్మవిశ్వాసం కల్పించడంతో పాటు ఆత్మగౌరవం పెంపొందించే చర్యలు చేపట్టారని నిరంజన్‌రెడ్డి వివరించారు.
465 Total Views, 2 Views Today