నాబార్డ్ కుట్టు మిషన్ కేంద్రం ప్రారంభం
1 min read
AABNEWS: తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్
మహాదేవపూర్ మండల కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్ ఆవరణలో సర్పంచ్ శ్రీపతిబాపు తో కలిసి నాబార్డ్ కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎంపీపీ బి రాణిబాయి అధికారికంగా ప్రారంభించారు.మహిళా సాధికారిత,ఆర్థిక స్వాలంబన సాధించడమే లక్ష్యంగా నాబార్డ్ గ్రామీణ మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని,గ్రామీణ యువత కు నాబార్డ్ ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామం అని,ఉపాధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పడానికి యువత కు ఆర్థిక చేయూత నివ్వాలని యూనియన్ బ్యాంక్ మేనేజర్ ఉమేష్ చౌహన్ ను కోరారు.మహిళలు వంటింటికే పరిమితం కాకుండా,వృత్తి నైపుణ్యాలు సాధించి పనిచేసే స్త్రీలుగా అన్ని రంగాల్లో రాణించాలని సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు.కుట్టు శిక్షణ కేంద్రాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ గుడాల అరుణ అన్నారు.గ్రామీణ వ్యవసాయ మహిళల అభివృద్ధికి నాబార్డ్ ద్వారా అనేక కార్యక్రమాలు నడుస్తున్నాయని,మహిళల ఉపాధికి కుట్టు శిక్షణ ఓ మార్గం లాంటిదని నాబార్డ్ ఏజిఎం అరుణాచలం కృష్ణమోహన్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ జి ఓ ఆర్గనైజర్లు,పంచాయతీ పారిశుధ్యం స్థాయి సంఘం కన్వీనర్ లింగాల రామయ్య,వార్డు సభ్యులు మెరుగు స్వప్న,కొక్కు మీనా,నూకల గట్టమ్మ,కడార్ల శంకర్,రెబ్బ అనిత,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
24 Total Views, 2 Views Today