AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నారా లోకేష్ శవరాజకీయాలు మానుకోవాలి…

1 min read

AABNEWS :నారా లోకేష్ శవరాజకీయాలు మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను హితవు పలికారు. శనివారం జగ్గయ్యపేట పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలతో జరిగిన కర్నూలు ఘటనను నారా లోకేష్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 30కి పైగా రాజకీయ హత్యలు జరిగాయని, అప్పుడు ఏ రాజ్యాంగం నడిచిందో చంద్రబాబు, లోకేష్ చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి సీబీఐ రాకూడదని చట్టం తెచ్చిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. గ్రామాల్లో జరిగిన ఘటనలను ప్రభుత్వం పై ఆపాదించడం సరైన పద్ధతి కాదన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని ఆయన అన్నారు.

 2,911 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.