జేసీ ఐ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని…
1 min read
AABNEWS : జేసీ ఐ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని
వినాయక్ నగర్ బస్వా గార్డెన్ లో అమేజింగ్ తైక్వాండో అకాడమీ మహిళ కోచ్ నాగరాణి చే విద్యార్థులకు, యువతులకు ఆత్మరక్షణ తరగతులు నిర్వహించామని జేసీ ఐ ఇందూరు అధ్యక్షుడు చంద్రశేఖర్ పెందోటి అన్నారు.ఈ సదర్బంగా మాట్లాడుతూ యువతులకు ఫిట్ నేస్, ఆత్మ రక్షణ, పై అవగాహన కల్పించి, శరీరక, మానసికంగా ఎదుగుదల అయ్యేలా శిక్షణ ఇప్పించామని అన్నారు. వైస్ ప్రెసిడెంట్ డా. సి ఏం మధుసూదన చారీ గారు ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ డా. బి .ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మహిళలకు రిజర్వేషన్ లో సమానమైన రాజ్యాధికార హక్కులను కల్పించారు కానీ స్వాతంత్య్రం వచ్చి 74 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్కరు కూడా మహిళా ప్రధానమంత్రిగా రాజ్యాధికారం దక్కలేదు దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు మహిళలకు రాజ్యాధికారం రాలేదు అంటే ఎంతగ మహిళలను అణచివేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. రాజ్యంగంలో మహిళలకు సమన హక్కు కల్పించాలి అని రాజ్యాంగం లో చేర్చిన ఇప్పటి వరుకు దాన్ని అమలు పరిచింది లేదు ఈ కార్యక్రమంలో జేసిఐ ఇందూరు సభ్యులు మనోజ్ ,మచ్చేందర్ , శ్రీనివాస్ ,ప్రవీణ్ మరియు బాలికలు పాల్గొన్నారు


1,175 Total Views, 5 Views Today