AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నిబంధనలు పాటిస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండదు…

1 min read

AAB NEWS : ట్రాఫిక్ నిబంధనలను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉండదని హనుమాన్ జంక్షన్ సి.ఐ కే.సతీష్ అన్నారు.సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అయన తొలిసారిగా స్థానిక విలేకరులతో బుధవారం సర్కిల్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పని చేస్తానని హామీ ఇచ్చారు.సమాజంలో చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అందుకు మీడియా మిత్రులు సహకరించాలని కోరారు.ప్రజలు తమకు చెప్పలేని విషయాలను,సమాచారాన్ని కొన్ని సందర్భాల్లో విలేకరులకు తెలిపే అవకాశం ఉంటుందన్నారు.ఆకస్మిక దాడులు నిర్వహించేందుకు కీలకమైన సమాచారం ఉంటే తనకు అందజేయాలని సూచించారు.హనుమాన్ జంక్షన్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు త్వరలో ఆటో డ్రైవర్లు,స్థానికులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.చిన్నారులకు ద్విచక్ర వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఇవ్వకుండా ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు అందుకు కారణమైన వారిపై కేసులు నమోదు చేస్తామని వివరించారు.సైరన్ పెట్టుకొని తిరుగుతున్న వాహనాలను, బుల్లెట్లకు లౌడ్ సైలెన్సర్ లు ఏర్పాటు చేసి తిరిగే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కర్ఫ్యూ సమయంలో మెడికల్ ఎమర్జెన్సీ, డ్యూటీ టైం లో ఉన్న ఉద్యోగులు తప్ప మిగిలిన వారు బయటకు వస్తే జరిమానాలు తప్పవని పేర్కొన్నారు. ఈరోజున హనుమాన్ జంక్షన్ CI గారు సరియైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనము నడుపుతున్న 2 వ్యక్తుల వద్ద నుండి 2 వాహనములను సీజ్ చేసి వాహన తనిఖీ నివేదికను RTO గారికి పంపడం జరిగినది. సదరు కార్యక్రమములో హనుమాన్ జంక్షన్ CI కె.సతీష్ గారు, హనుమాన్ జంక్షన్ SI లు పి.గౌతమ్ కుమార్ గారు, కె.ఉషా రాణి గారు, RS Mobile SI పి. సుందర రావు గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

 232 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.