AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నిహారిక పెళ్లిలో ఫుల్‌ బిజీ…

1 min read

AAB NEWS : మెగా బ్రదర్‌ నిహారిక పెళ్లి మరో కొన్ని గంటల్లో కానుంది. డిసెంబర్‌ 9న ఉదయ్‌ పూర్‌ ప్యాలెస్‌ వేదికగా చైతన్య-నిహారికల పెళ్లి వేడుక జరుగనుంది.నిహారిక పెళ్లి గుంటూరు ఐజీ ప్రభాకర్‌ రావు తనయుడు వెంకట చైతన్యతో ఈ నెల 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథున లగ్నంలో జరుగనుంది. అయితే.. మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మరింత పెరిగింది. మెగా డాటర్ నిహారికా వెడ్డింగ్ సందర్భంగా కుటుంబం మొత్తం రాజస్థాన్ ఉదయ్ పూర్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు ఈ పెళ్లికి సంబంధించిన చిన్న వీడియోను తన ఇన్‌స్టా ద్వారా షేర్ చేశాడు. అందులో దాదాపు మెగా ఫ్యామిలీ మొత్తం ఈ పెళ్లికి హాజరయ్యారు. ఇందులో మెగా బ్రదర్స్ చిరు, నాగబాబు పక్కపక్కన మనకు కనిపిస్తారు. కేవలం మెగా ఫ్యామిలీనే కాకుండా అల్లువారి కుటుంబం కూడా స్పెషల్ ఫ్లైటర్ల ద్వారా ఉదయ్ పూర్‌కు వెళ్లారు. నిహారికా, చైతన్యల వివాహ వేడుక రేపు జరుగనుంది. ఇందులో టాలీవుడ్ తారాగనం మొత్తం కనిపిస్తుంది. మెగా డాటర్ వివాహాన్ని ఉదయ్ పూర్‌లో ఓ పండుగలా జరుపుతున్నారు. ఈ పోస్ట్‌కు నాగబాబు స్నీక్ పీక్.. తరువాత వచ్చే దాన్ని చూడాలి అంటూ రాసుకొచ్చాడు.

 18 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.