September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

నూతన వ్యవసాయ చట్టాలతో అన్నదాత కే కాదు అందరికీ ముప్పే…

1 min read

AABNEWS :నూతన వ్యవసాయ చట్టాలతో అన్నదాత కే కాదు అందరికీ ముప్పే ఆళ్ళ హనుమాన్ జంక్షన్ గుడివాడ టైమ్స్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి సంయుక్త కిసాన్ మోర్చా పిలుపుమేరకు రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఈ నెల 26న జరిగే భారత్ బంద్ విజయవంతం చేయాలని లైన్స్ క్లబ్ ఆవరణలో రైతు సంఘాల సమన్వయ సమితి హనుమాన్ జంక్షన్ శాఖ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మండల సిపిఎం కార్యదర్శి బేతా శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు సంఘాల సమన్వయ సమితి నేత ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూస్వేచ్ఛా వాణిజ్య ముసుగులో రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల చట్ట సవరణ ద్వారా ద్వారా ప్రైవేటు ట్రేడర్ లను ప్రోత్సహించి మార్కెట్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వలన సామాన్య మానవుడికి అందుబాటులో లేకుండా నిత్యవసర వస్తువుల ధరలు అందరికీ ముప్పు ఏర్పడుతుందని ఈనెల 26న జరిగే భారత్ బంద్ కు రైతులు, కార్మికులు, విద్యార్థి విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొని బందును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, గన్నవరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నక్కా గాంధీ, మాజీ జెడ్పీటీసీ సుంకర సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర తెలుగు మహిళా నాయకురాలు మూల్పూరి సాయి కళ్యాణి, అఖిలపక్ష రైతు సంఘం నేతలు చెన్నబోయిన శివయ్య, అబ్దుల్ బారీ, అట్లూరి శ్రీనివాస్, గుండపనెని ఉమా వరప్రసాద్, వేములపల్లి శ్రీనివాసరావు, జాన్ మోడీ తదితరులు పాల్గొన్నారు

 2,080 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.