న్యూజెర్సీలో ట్రైన్ ప్రమాదం
1 min read
AAB NEWS: ప్రవీణ్ వరంగల్ రిపోర్టర్
హనుమకొండ భవాని నగర్ కు చెందిన దేశిని ప్రవీణ్ కుమార్ తండ్రి పేరు దేశిని రాజమౌళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిసెంబర్ 22 వ తేదీన ఉదయం 7:30 కు ఎడిషన్ రైల్వే స్టేషన్ కు సమీపంలోని న్యూజెర్సీలో రన్నింగ్ లో ఉన్నటువంటి రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గత కొద్ది సంవత్సరాలుగా న్యూజెర్సీ లో నివసిస్తున్న ప్రవీణ్ కుమార్ అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ రైల్ ఎక్కబోతుండగా ఈ ప్రమాదం సంభవించిందని ఎడిషన్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే అధికారులు మరియు ప్రవీణ్ కుమార్ స్నేహితులు ధృవీకరించారు ప్రవీణ్ కుమార్ కు భార్య ఒక కుమారుడు ఉన్నట్లు సమాచారం. ప్రవీణ్ కుమార్ మృతదేహాన్ని భారత ప్రభుత్వం అధికారులు వీలైనంత తొందరలో హనుమకొండలోని వారి స్వగృహానికి తరలించే విధంగా చర్యలు చేపట్టాలని భారత విదేశాంగ శాఖ మంత్రి గారిని హనుమకొండ కు చెందిన వారి చిన్ననాటి స్నేహితులు రమేష్ ,భార్గవ్,జి.ప్రవీణ్ కుమార్, సందీప్ ,వంశీ, రంజిత్, నటరాజ్, శ్రావణ్, దిలీప్, శ్రీకాంత్,చందు, కార్తీక్ ,తిరుమల్ ,ఉదయ్ లు కోరుతున్నారు.
31 Total Views, 2 Views Today