పవన్ క్షమాపణలు చెప్పాలి…
1 min read
AABNEWS : జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుడివాడలో పర్యటించి వైసీపీ నేతల మీద తీవ్రమైన కామెంట్లు చేయడంతో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానికి పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంత్రుల గురించి మాట్లాడేటప్పుడు పవన్ జాగ్రత్తగా మాట్లాడాలి. మంత్రుల పట్ల సంస్కారం లేకుండా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఆరు నెలలకు ఒకసారి పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వస్తున్నారని విమర్శించారు. రైతులపై పవన్ కల్యాణ్ మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు అవంతి. చంద్రబాబు సొంత పుత్రుడు, దత్త పుత్రుడు ఇద్దరు రైతులపై కపట ప్రేమ కురిపిస్తున్నారు. సినిమా షూటింగ్ లేదు కాబట్టి పవన్ హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి వచ్చారు. లోకేష్ టైం పాస్‌కు వచ్చినట్లు రాష్ట్రానికి వస్తున్నారు. అని విమర్శించారు. మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఇంతకీ పవన్ ఎవరు? అని ప్రశ్నించారు. మెడపై మట్టి నలుపుకుంటూ ఉండే ఆయనేనా పవన్ కల్యాణ్ అంటే? అంటూ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు చిడతలు కొట్టిన వ్యక్తి పవన్ అని.. చిడతలు వాయిస్తూ డబ్బులు సంపాదించడంలో పవన్ దిట్ట అని అన్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా పవన్ మీద సెటైర్లు వేశారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేకపోయారని విమర్శించారు. రాజకీయం అంటే సినిమా సెట్టింగులు, షూటింగులు కాదని అన్నారు. సినిమా సెట్టింగ్ రాజకీయాలు ఎప్పుడో పోయాయని.. సినిమాలు చేయాలనుకుంటే సినిమాలే చేసుకోండి… ప్రజల సమస్యలు తెలుసుకోవాలనుకుంటే మా నాయకుడిలా పాదయాత్ర చేయండి అంటూ పవన్ కల్యాణ్ కు సూచించారు. 14 నెలల పాటు పాదయాత్ర చేయడం అంటే సినిమా చేసినట్టు కాదని ఎద్దేవా చేశారు. దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘సినిమాల్లోనే పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ అని.. బయట మాత్రం పకీర్ సాబ్’ అంటూ విమర్శించారు. పవన్ పర్యటన సినిమా ప్రమోషన్లా ఉందని అన్నారు.
102 Total Views, 2 Views Today