AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పార్టీలతో సంబంధం లేకుండా పేదవారికి మీరందరూ సహకరించండి-మంత్రి డా.అప్పలరాజు గారు…

1 min read

AAB NEWS :ఈరోజు పలాస, వజ్రపుకొత్తూరు,మందస మండలాల ఎమ్మార్వోలు, ఎంపిడిఓలు, పలాస మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ డీఈ మరియు మూడు మండలాల ఏఈ లతో సమావేశమైన మంత్రివర్యులు శ్రీ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు.అర్హులైన వారికి ఎటువంటి పధకం అందకపోయినా సహించేది లేదు- మంత్రివర్యులు డాక్టర్ సీదిరి*పార్టీలతో సంబంధం లేకుండా పేదవారికి మీరందరూ సహకరించండి-మంత్రి డా.అప్పలరాజు గారుఈరోజు పలాస నియోజకవర్గంలో ఉన్న మూడు మండలాల ఎమ్మార్వోలు, ఎంపిడిఓలు, పలాస మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ డీఈ మరియు మూడు మండలాల ఏఈ లతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్యులు శ్రీ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు.ప్రతీ సచివాలయం నుంచి హాజరైన హౌసింగ్ ఎన్రోల్మెంట్, జియో ట్యాగింగ్ మ్యాపింగ్ వంటి కార్యక్రమాలు సెక్రటేరియట్ పరిధిలో చేస్తున్నట్టి టెక్నికల్ అసిస్టెంట్లు మరియుప్రస్తుత పరిస్థితుల్లో మనం ఈ హౌస్ స్కీం కి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాం అంటే.. మనకు స్వాతంత్య్రం వచ్చి సుమారు ఆరేడు దశాబ్దాలు అవుతుంది. మన రాష్ట్రం ఏర్పడి కూడా ఆరున్నర దశాబ్దాల కాలమైంది. ఈ ఆరున్నర దశాబ్దాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరవై డబై సంవత్సరాలకు గాను సుమారుగా 45 లక్షల ఇల్లు మాత్రమే మంజూరు చేసుకోగలిగితే..మన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో మన సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వంటి కష్ట సమయంలో కూడా ముప్పై లక్షలు ఇల్లును ఒక్క ఆంద్రప్రదేశ్ లోనే ఇవ్వడం దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఇది గొప్ప విషయం. అందుకే ఇది అతి ముఖ్యమైన పధకమని,దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.దీనికి ఒక లక్ష్యం పెట్టుకున్నాం.అదేమిటంటే మన రాష్ట్ర జనాభా ఐదున్నర కోట్లు మంది ఉంటే అందులో కోటి ఎనబై లక్షల కుటుంబాలు ఉంటే అందులో సుమారు కోటి ఏభై లక్షల మందికి మాత్రమే ఇల్లు ఉన్నాయి.మరి మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో చేపట్టిన పాదయాత్రలో వేలాది మంది కుటుంబాలు గత ఐదు సంవత్సరాలుగా కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేదని,తమరే మాకు న్యాయం చేయాలని కోరడంతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ముప్పై లక్షల కుటుంబాలకు ఇల్లు మంజూరు చేయడం జరిగిందని దీనికి ఎంతో ధైర్యం కావాలని, గొప్ప భవిష్యత్తు దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని, 2024 లో కూడా మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు కూడా రెండు లక్షలు దాటి ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంటే మనం ఓడిపోయినట్టే లెక్క అని, అంటే అటువంటి పరిస్థితి రాకూడదని, పేదవాడు ఎవరూ ఇల్లు లేకుండా ఉండరాదని తెలిపారు.గతంలో మీరు ఊహించని విధంగా ప్రభుత్వం అందిస్తున్న ఈ పధకం ప్రతీ లబ్ధిదారునికి చేరేలా కృషి చేయాలని, టెక్నికల్ సమస్యలు ఉంటే దగ్గరుండి పరిష్కరించాలని,పేదవారు ఎవరూ ఇల్లు లేకుండా ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని ఎమ్మార్వో, ఎంపిడిఓ లకు ఆదేశించారు. మీ పరిధిలోకి వచ్చిన ప్రతీ సమస్యను నిబద్దతతో పరిశీలించి సకాలంలో పరిస్కారించాలని మంత్రివర్యులు సూచించారు.

ప్రతీ ఒక్క ఉద్యోగి సమయానికి సచివాలయానికి రావాలని, పని పై సరైన దృష్టి పెట్టి పని చేయాలని, దిగువ స్థాయి నుండి పై వరకూ ప్రతీ ఒక్కరి దినసరి హాజరు నమోదు చేయాలని, సమయానికి విధులకు హాజరు కాని పక్షంలో తగు చర్యలు తీసుకోవాలని,ఈ విషయంలో ఉపేక్షించేది లేదని మంత్రివర్యులు అధికారులకు హెచ్చరించారు.మండలంలో ప్రతీ పంచాయతీని మోనిటరింగ్ చేయాలని, ఏవరీకైనా పింఛను రాకపోయినా, ఇల్లు రాకపోయినా ఉపేక్షించేది లేదని ఈ పప్పులు ఇక ఉండకవని అధికారులకు మంత్రివర్యులు సూచించారు.ఒక సుదీర్ఘమైన లక్ష్యం కోసం పనిచేస్తున్నామని, మన జిల్లాలో ఉన్న అన్ని హౌస్ స్కీం నిర్మాణాలన్నీ మొదటి ఫేజ్ లో అయ్యే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని, మన జిల్లా అన్ని విధాలా వెనుక పడిపోవడం వల్ల ఇటువంటి సంక్షేమ పథకాలు అందించి మన జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారని, దీనికి మనందరం కలిసి కట్టుగా పనిచేసి నిరూపించుకోవాలని సూచించారు.ఆరు లేదా ఏడు అడుగుల స్థలంలో ఇల్లు కట్టుకొని నివశించే ప్రతీ పేదవారికి మనం సహకరించాలని, అటువంటి వారికోసం గ్రామ స్థాయిలో కో ఆర్డినేట్ చేయడం ముఖ్యమని, పేదవారికి సహాయం చేయాలని ఆదేశించారు.నల్లబొడ్లూరూ,బైర సారంగిపురం వంటి పంచాయితీల లే ఔట్లు కోసం దిశానిర్దేశం చేయడం జరిగింది. 

అవసరమైతే పోలీసులు అధికారుల సహాయంతో పని చేయాలని, ప్రతీ పేదవాడిని గుర్తించి సహాయం చేయాలని ఆదేశించారుఇప్పటివరకు 15260 మందికి ఇల్లు ఇచ్చామని, నేను మరో వారం రోజుల్లో ప్రతీ పంచాయతీ లో పర్యటిస్తానని,ఆ సమయంలో ఎవరూ ఇల్లు రాలేదని నా వద్దకు రాకూడదని,రేపటి నుండే మీరు నిజమైన పేదవారిని గుర్తించి పార్టీలకు అతీతంగా ఇల్లు మంజూరు చేయాలని సూచించారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని మంత్రివర్యులు శ్రీ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు తెలిపారు.

ప్రతీ ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలని,చేసే పనిలో ఏదో సాధించాలనే లక్ష్యంతో పని చేయాలని, కాలక్షేపం కోసం పని చేయరాదని తెలిపారుప్రతీ ఒక్కరూ వీలైనంత డాటా పుస్తకాలు రూపంలో వ్రాసుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలని, పై అధికారులు వచ్చే వరకు క్రింది స్థాయి ఉద్యౌగులు ఎదురు చూడరాదని,అలా పై అధీకారులు చెబితే పని చేస్తానని ఆలోచించి కూర్చున్న వారి వలన ఉపయోగం లేదని, అటువంటి వారు నా నియోజకవర్గ పరిధిలో పని చేయనవసరం లేదని సూచించారు.
ప్రతీ ఏ.ఈ పంచాయతీ స్థాయిలో ఎస్టిమేట్ చేయడం నేర్ఛుకోవాలని ఆదేశించారుఈ సమావేశంలో మంత్రివర్యులు శ్రీ డాక్టర్ సీదిరి అప్పలరాజు గారి తోపాటు పలాస మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు గారు, వైయస్ చైర్మన్ బోర బుజ్జి గారు, ఏ.యం.సి చైర్మన్ పి.వి.సతీష్ గారు,వజ్రపుకొత్తూరు,మందస మండలాల ఎమ్మార్వోలు, ఎంపిడిఓలు, పలాస మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ డీఈ మరియు మూడు మండలాల ఏఈలు, మూడు మండలాల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, పలువురు పలాస మున్సిపాలిటీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

 58 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.