AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పార్టీ ఏర్పాటుపై షర్మిల కీలక ప్రకటన హైదరాబాద్‌ తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల కీలక ప్రకటన చేశారు…

1 min read

AABNEWS : పార్టీ ఏర్పాటుపై షర్మిల కీలక ప్రకటన హైదరాబాద్‌ తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల కీలక ప్రకటన చేశారు. ఖమ్మం వేదికగానే సమరశంఖం పూరిద్దామని.. ఏప్రిల్ 9న లక్షమందితో ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. లోటస్‌పాండ్‌లో ఖమ్మం జిల్లా నేతలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తెరాసకో, భాజపాకో బీ టీమ్‌గా ఉండాల్సిన అవసరం లేదని.. తాను ఎవరూ వదిలిన బాణం కాదని ఆమె స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికే తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. ఖమ్మం వేదికగానే సమరశంఖం పూరించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ ఏర్పాటు, విధి విధానాలపై ఖమ్మం నేతలకు వివరించారు. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాల్సిందిగా షర్మిలను ఈ సందర్భంగా అభిమానులు కోరారు..

 910 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.