AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి

1 min read

AAB NEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

గురువారం భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఏఐసిసి సభ్యులు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యేలను అంగట్లో పశువులను కొన్నట్లుగ ఎమ్మెల్యేలను కొనడం మొదలు పెట్టారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 12 మంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీ వారు కొనడం మొదలు పెట్టారు. అంతటితో సరి పోకుండా కాంగ్రెస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడానికి కూడా వెనుకాడడం లేదు. అదేవిధంగా కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గెలిచిన అటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారడం తో అక్కడ ఉన్నటువంటి స్పీకర్ వారిని సస్పెండ్ చేయడం జరిగింది.మరి ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు పార్టీ మారిన ఎమ్మెల్యే లను ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ఈ వేదిక ద్వారా మేం అడుగుతున్నాం.ఈ 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీ కి మారడానికి లేదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాo. ఇప్పటికైనా మీరు వెంటనే రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలో మళ్లీ ఎన్నికలలో పాల్గొనడానికి సిద్ధంగా ఉండాలని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు రాజీనామాలు చేయక పోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీ క్యాంపు కార్యాలయాలను రాజీనామా చేసేవరకు ముట్టడిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే టటువంటి నాగార్జునసాగర్ బై ఎలక్షన్ తో పాటుగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా వారిని సస్పెండ్ చేసి ఎన్నికలకు రావలసిందిగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి *అజ్మీర జంపయ్య, జిల్లా ఉపాధ్యక్షులు జోగ బుచ్చయ్య, భూపాలపల్లి పట్టణ ఉపాధ్యక్షులు భౌతు రాజేష్, మధుకర్ రెడ్డి, కె. రాజయ్య, రాములు నాయక్, కేతిరి సుభాష్, సల్లూరి సారయ్య, గజ్జ విజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 299 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.