AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పునర్జన్మల నేపథ్యంలో సాగే కథ …

1 min read

AAB NEWS:ప్రభాస్ తాజా చిత్రంగా ‘రాధేశ్యామ్’ రూపొందింది. రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. యూవీ క్రియేషన్స్ వారితో కలిసి కృష్ణంరాజు ఈ సినిమాను నిర్మించారు. ముగ్గురు సంగీత దర్శకులు ఈ సినిమా కోసం పనిచేశారు. ప్రభాస్ సరసన నాయికగా పూజ హెగ్డే నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ ప్రాజెక్టు పట్టాలెక్కి చాలాకాలమే అయింది. అనేక కారణాల వలన షూటింగు ఆలస్యమవుతూ వచ్చింది. ఇటీవలే షూటింగు పార్టును పూర్తిచేసుకున్న ఈ సినిమాను, ‘సంక్రాంతి’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 14వ తేదీన విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను వదిలారు.ఈ పోస్టర్ లో ప్రభాస్ చాలా స్టైలీష్ గా .. డీసెంట్ గా ఉన్నాడు. విదేశీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. పునర్జన్మలతో కూడిన ప్రేమ చుట్టూ తిరుగుతుంది. సంక్రాంతికి పవన్ .. మహేశ్ బాబు .. వెంకటేశ్ సినిమాలు బరిలో ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్ సినిమా కూడా బరిలోకి దిగుతుండటం ఆసక్తిని రేకెత్తించే విషయం.

 91 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.