November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పెంచిన పెట్రోల్, డిజిల్ ధరలను వెంటనే తగ్గించాలి

1 min read

AAB న్యూస్ భూపాలపల్లి రిపోర్టర్ మామిడి శ్రీధర్

సమావేశంలో మాట్లాడుతున్న నంగావత్ భాస్కర్ నాయక్

భూపాలపల్లి :- పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గిరిజన విద్యార్థి సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు నంగావత్ భాస్కర్ నాయక్ డిమాండ్ చేశారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద, మధ్యతరగతి వారు పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ కరోనా విజృంభిస్తున్న సమయంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెంచడం దారుణమన్నారు. ప్రభుత్వాలు ప్రజలను ఆర్ధికంగా ఆదుకోవాల్సిన తరుణంలో ధరలను పెంచడం ఎంత వరకు సమంజసంఅని ప్రశ్నించారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నంగావత్ భాస్కర్ నాయక్ డిమాండ్ చేశారు..ఈ ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ రుబ్బిన్ నాయక్, సోషల్ మీడియా ఇంచార్జ్ జగదీష్, ఉపాధ్యక్షుడు రాకేష్, కార్యదర్శి లావుడ్య సమ్ములాల్, కార్యదర్శి నంగావత్ బన్నీ, కోశాధికారి దేవేందర్, నరేష్, జయపాల్ తదితరులు పాల్గొన్నారు..

 510 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.