AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలి…

1 min read

AABNEWS : పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలి. ‌ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాఘవ ప్లాజా సెంటర్ లో ఆటోలను తాడుతో లాగేసి నిరసన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి సామాన్య మధ్య తరగతి ప్రజలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఇది దుర్మార్గమైన చర్యగా నిందించారు క్రూడ్ ఆయిల్ ధరలు రోజు రోజుకు తగ్గుతున్నప్పటికీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గిపోయి ఉంటే రోజురోజుకు అడ్డగోలుగా పెరగటం సరైనది కాదని కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు 60 రూపాయల లోపు ఉన్న పెట్రోలు డీజిల్ ₹100 పెరిగి గవాస్కర్ సెంచరీలు కొట్టినట్టుగా నరేంద్ర మోడీ సెంచరీ కొట్టాడు గ్యాస్ 350 రూపాయల నుండి 850 రూపాయలు వరకు పెంచి మహిళల ఆత్మ గౌరవాని దెబ్బతీసే విధంగా ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే నియంత్రించాలని ప్రభుత్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ధూళిపాల ధనంజయ నాయుడు, పట్టణ సహాయ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, నాయకులు బూర మురళి, గాలికృష్ణ , చారి తదితరులు పాల్గొన్నారు

 69 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.