AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పెట్రోలు ఆల్ టైమ్ రికార్డు…

1 min read

AABNEWS : దేశంలో పెట్రోలు ధర “ఆల్ టైమ్ రికార్డు”కు చేరుకుంది. అక్టోబర్ 2018లో న్యూఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ. 84ను తాకగా, ఇప్పుడా ధర రూ. 84.20కి చేరి సరికొత్త రికార్డును చేరుకుంది. దాదాపు 29 రోజుల తరువాత బుధవారం మరోసారి ధరలు పెరుగగా, గురువారం నాడు లీటరు పెట్రోల్ పై 23 పైసలు, డీజిల్ పై 26 పైసల మేరకు ధర పెంచుతున్నట్టు ముడి చమురు కంపెనీలు వెల్లడించాయి. తాజా పెరుగుదలతో ముంబైలో పెట్రోలు ధర రూ.90.83కు, డీజిల్ ధర రూ.81.07కు చేరగా, చెన్నైలో పెట్రోలు రూ.86.96కు, డీజిల్ రూ. 79.72కు చేరాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు పెరిగినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముడి చమురు కంపెనీలు తెలిపాయి. దేశ వ్యాప్తంగా పెట్రోల్-డీజిల్ ధరలు పెరుగుతూ ఉండడంతో మధ్య తరగతి ప్రజలపై భారం పడనుంది. ఇక పెట్రోల్-డీజిల్ ధరలు 100 రూపాయలు తగలడమే తరువాయి అని ప్రజలు భావిస్తూ ఉన్నారు.

 369 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.