September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పేదింటికి పెద్దన్న సీఎం కేసీఆర్‌ …

1 min read

AABNEWS : MD Amjad Khan Adilabad District Stafer : క్రిస్మస్‌ పండుగ సందర్భంగా క్రైస్తవులకు గిఫ్ట్‌ ప్యాక్‌లు పంపిణీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నరాని తెలంగాణ సర్కార్‌ సర్వమతాలను గౌరవిస్తూ వాటికి సముచిత స్థానం కల్పిస్తున్నదని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిస్సి చర్చి శాస్త్రి నగర్ లో క్రైస్తవులకు గిఫ్ట్‌ ప్యాక్‌ లు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్మస్‌ వేడుకలను పేదలు ఘనంగా జరుపుకునేలా ప్రభుత్వం గిఫ్ట్‌ ప్యాక్‌ లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు సారె పంపిణీ చేస్తున్నట్టుగానే రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలకూ దుస్తులు అందిస్తున్నట్లు చెప్పారు. నిర్మల్ జిల్లాలో సుమారు 3 వేల కుటుంబాలకు ప్యాక్‌లు పంపిణీ చేస్తుండగా నిర్మల్ నియోజకవర్గంలో 1000 కుటుంబాలకు,ముధోల్, ఖానాపూర్ లో 1000 ,1000 కుటుంబాలకు అందజేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలకు సీఎం కేసీఆర్‌ సమన్యాయం చేస్తున్నారని ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తూన్నారని అన్నారు. నిర్మల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని భవిష్యత్ లో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు..గాజుల్ పెట్ చర్చిని ఇతర రెండు చర్చిలను అభివృద్ధి చేస్తామన్నారు..అనంతరం కేక్ ను కట్ చేశారు ఈ సందర్భంగా క్రైస్తవులకు మంత్రి మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ డిసిసిబి చైర్మన్ రాంకిషన్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ నరగొని తులసి నర్సాగౌడ్ అధికారులు, TRS నాయకులు, పాస్టర్లు జయరాజ్, విజయ్, డేవిడ్,స్వామి దాస్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

 116 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.