పేద కుటుంబాలకు పెండ్లి ఖర్చు తగ్గింది: వికారాబాద్ ఎమ్మెల్యే. డాక్టర్ మెతుకు ఆనంద్ గారు…
1 min read
AABNEWS : పేద కుటుంబాలకు పెండ్లి ఖర్చు తగ్గింది: వికారాబాద్ ఎమ్మెల్యే. డాక్టర్ మెతుకు ఆనంద్ గారు గురువారం నాడు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు మర్పల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..
పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి గౌరవ KCR గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పేదల కష్టాల్లో పాలుపంచుకుంటున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లి ఖర్చు తగ్గిందని తెలిపారు. కళ్యాణలక్ష్మి పథకం వల్ల బాల్యవివహాలు తగ్గాయి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డి, MPP లలిత, ZPTC మధుకర్, AMC చైర్మన్ మల్లేశం, రైతు బంధు అధ్యక్షులు నాయబ్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, వైస్ MPP మోహన్ రెడ్డి, PACS వైస్ చైర్మన్ పసియోద్దిన్, పార్టీ ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీ లు, డైరెక్టర్లు మరియు అధికారులు పాల్గొన్నారు.
230 Total Views, 2 Views Today