AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పోలీస్ బాస్ కు కోవాగ్జిన్ కరోనా నివారణ టీకా…

1 min read

AABNEWS : జిల్లా పోలీస్ బాస్ కు కోవాగ్జిన్ కరోనా నివారణ టీకా,
రిమ్స్ ఆడిటోరియం సమావేశ మందిరంలో పోలీసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు,
జిల్లా ఎస్పీ తో పాటు పలువురు ఉన్నతాధికారులు, సిబ్బందికి కరోనా నివారణ టీకాలు,
బుధవారం జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ సూచన మేరకు స్థానిక రిమ్స్ ఆస్పత్రిలోని ఆడిటోరియం సమావేశమందిరంలో జిల్లా పోలీసులందరికీ కరోనా టీకాలు వేయించడానికి రిమ్స్ డాక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 500 మంది పోలీసులకు కరోనా టీకాలు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు, ఆడిటోరియం కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సందర్శించి ముందుగా ఆయన కరోనా నివారణ టీకా వేయించుకున్నారు, అనంతరం జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎస్. శ్రీనివాస్ రావు, ఏఆర్ అదనపు ఎస్పీ బి. వినోద్ కుమార్, గ్రామీణ సిఐ కే. పురుషోత్తం చారి, ట్రాఫిక్ సీఐ పేర్ల గంగాధర్, స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు, అన్వర్ ఉల్ హక్, మెస్రం చంద్రభాన్, పోలీస్ కార్యాలయం పర్యవేక్షకరాలు ఎం ఏ జోసెఫిన్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల. వెంకటేశ్వర్లు, తదితరులు టీకాలు వేయించుకున్నారు, ఈ సందర్భంగా జిల్లా పోలీసులనుద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ శరీరంలో ఇమ్యునిటీ శక్తి పెంచడానికి కోవాగ్జిన్ టీకాలు దోహదపడతాయిన్నారు, మొదట్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి రెండో డోసు సైతం అదే టీకాను వేయనున్నట్లు తెలిపారు,కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారికి మళ్లీ ఇదే వ్యాక్సిన్ రెండు డోసు 28 రోజుల అనంతరం ఇవ్వనున్నట్లు ఎస్పీ తెలిపారు, నేటితో జిల్లాలోని 90 శాతం మంది పోలీసులకు వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందని తెలిపారు, టీకా తీసుకున్న అనంతరం చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలఅన్నారు, రెండవ డోసు తీసుకున్నా రెండువారాల తర్వాత మన శరీరంలో కరోనా మహమ్మారి వైరస్ నశింపజేయుడానికి శక్తి ఉత్పన్నమవుతుందన్నారు, కోవిడ్ టీకా విషయంలో ఎలాంటి భయాందోళనలు, అపోహలు అవసరం లేదని తెలిపారు, ఇవి పూర్తిగా సురక్షితమైనవని, ఇప్పటి వరకు టీకా తీసుకున్న వారెవరికీ ఎలాంటి దుష్పరిణామాలు రాలేదని అన్నారు, ప్రతి ఒక్కరూ నిర్భయంగా నివారణ టీకాలు వేయించుకోవాలన్నారు, అదనపు ఎస్పీ బి.వినోద్ కుమార్ పర్యవేక్షణలో జిల్లాలోని వెయ్యి మంది పైచిలుకు పోలీస్ అధికారులు, సిబ్బందికి టీకాలు అందించే కార్యక్రమం గత మూడు రోజుల నుంచి కొనసాగుతుందని తెలిపారు, కరోనా మహమ్మారి వైరస్ విషయంలో ప్రభుత్వం సూచించిన ఆదేశాలు పాటించాలని, వ్యాక్సినేషన్ అనంతరం ప్రభుత్వం తుది ఉత్తర్వులు వచ్చేవరకూ జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలన్నారు, వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన రిమ్స్ డాక్టర్లను జిల్లా ఎస్పీ అభినందిస్తూనట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి (పరిపాలన) ఎస్. శ్రీనివాసరావు, ఏఆర్ అదనపు ఎస్పి బి. వినోద్ కుమార్, డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, డిప్యూటీ డిఎంహెచ్ఓ పి. సాధన, డిఐఓ విజయసారథి, పట్టణ డిఎస్పి వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ సీఐ పేర్ల గంగాధర్, గ్రామీణ సిఐ కే. పురుషోత్తం చారి. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పోలీస్ కార్యాలయం పర్యవేక్షరాలు, ఎంఏ జోసెఫిన్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐలు, అన్వర్ ఉల్ హక్, మెస్రం చంద్రభాన్, ట్రాఫిక్ ఎస్ఐ సయ్యద్ అబ్దుల్ బాకీ, తదితరులు పాల్గొన్నారు.

 278 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.