పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం…
1 min read
AABNEWS : భీమారం పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం
అధునాతన సౌకర్యలతో సాంకేతిక పరిజ్ఞానంతో నూతనంగా నిర్మించిన రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా భీమారం మోడల్ పోలీస్ స్టేషన్ ను ఈరోజు చెన్నూర్ ఏం.ఎల్ .ఏ, ప్రభుత్వ విప్ శ్రీ బాల్క సుమన్,పెద్దపల్లి ఎంపి శ్రీ వెంకటేష్ నేత, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ వి.సత్యనారాయణ ఐపిఎస్, మంచిర్యాల డిసిపి శ్రీ ఉదయ్ కుమార్ రెడ్డి, జైపూర్ ఏసీపీ నరేందర్ గార్లు ప్రారంభించారు.ఈ సందర్భంగా సిపి శ్రీ సత్యనారాయణ గారు మాట్లాడుతూ గౌరవ డిజిపి గారి ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ లో అనువైన విధంగా, సంతృప్తికరంగా ఫిర్యాదు దారులకు సౌకర్యాలు కల్పించామని, ప్రజలలో పోలీసులు మా కోసం ఉన్నారనే భావన కలిగేలా తెలంగాణ సీఎం గారు పోలీస్ శాఖను పునర్వ్యవస్థీకరణ చేశారని, అత్యాధునిక టెక్నాలజీతో భీమారం మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు సమకూర్చినందున్న పోలీస్ స్టేషన్ నిర్మాణం త్వరగా పూర్తిచేయడం సాధ్యమందని అన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా సేవలు అందించడం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండడం మన పోలీసు వ్యవస్థ యొక్క ప్రత్యేకత అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ఫంక్షనల్ వర్టికల్ వారిగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. పోలీస్ స్టేషనుకు వచ్చే ప్రతి ఒక్కరికి జవాబుదారిగా పోలీసులు పని చేస్తున్నారని, టెక్నాలజీ ఉపయోగించి పోలీసు వ్యవస్థ ముందుకు వెళుతుందని, రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఫిర్యాదుదారులు ఇచ్చే ప్రతి దరఖాస్తును ఆన్ లైన్ లో పొందుపరచడం జరుగుతుందని, భవిష్యత్తులో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని, కేసులను వేగంగా ఛేదిస్తున్నామని ఆయన అన్నారు.పెద్దపల్లి ఎంపీ శ్రీ వెంకటేష్ నేత మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ లోని పోలీస్ వ్యవస్థలో తీసుకొచ్చిన పెనుమార్పులు గురించి వివరించారు.తెలంగాణ పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభివృద్ధి తో పాటు పోలీస్ వ్యవస్థ ఆధునీకరణ పై ప్రత్యేక దృష్టిని సారించి గత 6 ఏళ్ళలో
తెలంగాణ పోలీస్ వ్యవస్థను జాతీయ స్థాయిలో అగ్రభాగాన నిలిపారని, దేశంలోనే మెరుగైన శాంతి భద్రతలు మన రాష్ట్రంలో ఉన్నాయని అన్నారు. బాధితులను కుటుంబసభ్యులుగా చూస్తూన్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పోలీస్ శాఖకు అధునాతనమైన వాహనాలు సమకూర్చి ప్రజలకు సత్వర సేవలు అందించడానికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందని, ఫ్రెండ్లీ పోలీసింగ్ తో తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు సత్వర సేవలు అందించడంతో పాటు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడంతో పాటు ఆధునిక టెక్నాలజీతో ఉత్తమ సేవలు అందించడం జరుగుతుందని, మన రాష్ట్రం శాంతి భద్రతల విషయంలో ఇండియాలో నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత 6 సంవత్సరాల నుండి నూతనంగా పోలీస్ స్టేషన్లు, కమిషనర్
కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయాలు నిర్మించడం జరుగుతున్నదని, తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు లేకుండా గత 6 సంవత్సరాల నుండి పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్తమమైన సేవలు అందిస్తున్నారని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, చెన్నూర్ ఏం.ఎల్. ఏ శ్రీ బాల్క సుమన్ గారు మాట్లాడుతూ సరిహద్దులో ఆర్మీ కట్టు దిట్టంగా పనిచేసినప్పుడు దేశం భద్రంగా ఉంటుంది. అంతర్గత భద్రతలో పోలీస్ కూడా అంటే ముఖ్యం. శాంతిభద్రతల సమస్యలు లేనప్పుడే పెద్ద పెద్ద కంపెనీలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టడం ద్వారా నిరుద్యోగ సమస్య తీరుతుంది. అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు
పెడుతున్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నందున రాష్ట్ర అభివృద్ధికి పోలీస్ శాఖ చేస్తున్న సేవలే అని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని పోలీసులు కూడా ప్రజల్లో ఒక భాగమే అని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు అందిస్తున్న సేవల మూలంగా ఇతర రాష్ట్రాలలోని పోలీసులు మన పోలీసు వ్యవస్థను ఆదర్శంగా తీసుకుని తమ పోలీస్ వ్యవస్థల్లో మార్పులు తీసుకొస్తున్నారని అంటూ పోలీసుల చిత్తశుద్ధి, కార్యదక్షత వల్ల రాష్ట్రంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా ముందుకు వెళ్తుందని అన్నారు.
46 Total Views, 2 Views Today