AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రజల్లో కొత్త వెలుగులు నింపాలి

1 min read

AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా భూతం బెడద తగ్గి నూతన సంవత్సరంలో ప్రజల్లో కొత్త వెలుగులు నింపాలని ప్రభుత్వ ఛీప్ విప్,వరంగల్ పశ్చిమ నియెూజక వర్గం శాసన సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు.సీనియర్ జర్నలిస్ట్,తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కోషాధికారి వేముల సదానందం నేత నేతృత్వంలో నడుస్తున్న ఢీంబాయ్ టివి ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ముద్రించిన నూతన సంవత్సరం 2021 క్యాలెండర్ ను ప్రభుత్వ ఛీప్ విప్,వరంగల్ పశ్చిమ నియెూజక వర్గ శాసన సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ మంగళవారం లాంఛనంగా అవిష్కరించారు.ఈ సందర్బంగా దాస్యం మాట్లాడుతూ గత సంవత్సరం కరోనా కష్ట కాలంగా ముగిసిందని,అన్ని వర్గాల ప్రజలను అతలాకుతలం చేసిందన్నారు.గత చేదు అనుభవాలను మదిలో పెట్టుకొని సెకండ్ వేవ్ స్ట్రేయిన్-కరోనా భారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా మెదలాలని కోరారు.ప్రజలు తమ దిన చర్యల్లో సామాజిక దూరం,మాస్క్ తప్పనిసరి పాటించాలని దాస్యం పిలుపు నిచ్చారు.ప్రజలు అశ్రద్ధ వహించకుండా నిత్యం అప్రమత్తంగా ఉండాలని దాస్యం కోరారు.
కరోనా గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే అనేక ఛేదు ఉదాహరణలు కళ్ళ ముందు కదలాడుతున్నాయని దాస్యం ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రజలకు,ఢీంబాయ్ టివి ప్రేక్షకులకు దాస్యం నూతన సంవత్సర,సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా పరిషత్ మాజీ చేర్మన్ సాంబారి సమ్మారావు.ఢీంబాయ్ సీఈవో వేముల సదానందం నేత పాల్గొన్నారు.

 121 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.