September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రజల మనిషి మాజీ MLA బాగన్న మృతి…

1 min read

AABnEWS : తనకోసం ఒక్క రూపాయి కూడా సంపాదించ కుండా, నిరంతరం జహీరాబాద్ ప్రజల శ్రేయస్సు కోసం పరితపించిన ఒక మాజీ ఎమ్మెల్యే చెంగల్ బాగున్న ముదిరాజ్ గొప్ప నాయకుని జహీరాబాద్ ప్రజలు నేడు కోల్పోయారు, మీరు ఏ లోకాన వున్న మీ ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటున్నాను ఓం శాంతి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ బాగన్న ముదిరాజ్ గారు హైదరాబాద్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
వార్డ్ మెంబర్ గా ప్రస్థానం ఆరంభించిన చెంగల్ బాగాన్న ఎమ్మెల్యే స్థాయికి ఎదగడానికి చాలా పోరాటం చేసాడు.బాగన్నా స్వస్థలం సంగారెడ్డి జిల్లా మొగుడం పల్లి మండలం లోని గోపన్ పల్లి గ్రామం. మొదట గా కూలీ పనులు చేస్తూ, జహీరాబాద్ పట్టణ శివారులోని చెక్కర కర్మాగారాని కి ఎడ్ల బండ్ల పై చెరుకు ను రవాణా చేస్తూ, అనంతరం ఎడ్ల బండ్ల ద్వారా చెరుకు రవాణా చేసే బండ్ల కాంట్రాక్టు ను తీసుకుని చెక్కర ఫ్యాక్టరీ కి చెరుకు సరఫరా చేస్తుండటం తో ఆయనను అందరు బండ్ల బాగన్నా గానే పిలిచేవారు.అనంతరం సివిల్ కాంట్రాక్టర్ గా కొనసాగుతూ క్లాస్ వన్ కాంట్రాక్టర్ గా ఎదిగాడు. ఇక రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడితే మొదటగా గ్రామ వార్డు సభ్యునిగా ఎన్నికై, ఆ గ్రామ సర్పంచ్ గా పదవి బాధ్యతలు నిర్వహించాడు. మొదట్లో జనతా పార్టీలో కొనసాగినా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. మండలాల ఏర్పాటు తర్వాత జహీరాబాద్ మండలంకు మొదటి మండల పరిషత్ అధ్యక్షుడు గా ఎన్నికయ్యారు.ఇదంతా ఒక ఎత్తయితే ఎమ్మెల్యే కావడం మరో ఎత్తు. ఆయనకు జహీరాబాద్ అసెంబ్లీ స్థానం కు 1994 లోఅప్పటి టీడీపీ అధినేత స్వర్గీయ ఎన్టీఆర్ 9నెలలు ముందుగా టికెట్ ఖరారు చేయడం తో ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని, స్థానిక టీడీపీ నాయకులు 9 నెలలు పాటు తీవ్ర ప్రయత్నం చెసినా , టి డి పి అధిష్టానం పై ఎంతో ఒత్తిడి తెచ్చినా ఎన్టీఆర్ ఆయన అభ్యర్థిత్వం మార్చనని ఖరాఖండిగా తెల్చడంతో పాటు తన నిర్ణయాన్నీ ఎవరు వ్యతిరేకించినా పార్టీ లో ఉండాల్సిన అవసరం లేదని తీవ్రంగా హెచ్చరించడంతో వారు బాగన్నా ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి మద్దతుగా పని చేయడం, ఇక బాబ్రీ మసీదు సమస్య, కాంగ్రెస్ పార్టీ పై వ్యతిరేకత, టీడీపీ గాలి అన్ని కలిసి 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 37వేల మెజారిటీ తో, జహీరాబాద్ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ తో ఆయన కాంగ్రెస్ పార్టీ పై గెలుపొందడం విశేషం.ఇక 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ నిరాకరించడం తో ఆయన రెబెల్ గా నేమినేషన్ వేసినా పార్ట్ అధిష్టానం సర్ది చెప్పాడం తో నామినేషన్ ఉపసంహరించుకొని పోటీ చేయలేదు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినా ఆయన ఓటమి చెందారు. అనంతరం టి ఆర్ ఎస్ పార్టీ లో చేరి అదే పార్టీ లో కొనసాగుతున్నారు. ఈ మధ్య కాలంలో వయస్సు మీద పడటం తో ఆరోగ్యం దెబ్బతిని, గత మూడు రోజులుగా హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. 2009 ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుండి జహీరాబాద్ ఎం.పి స్థానానికి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు.

 500 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.