ప్రతిరోజు పదుల సంఖ్యలో టిప్పర్ లతో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు….
1 min read
AABNEWS : వరంగల్ రూరల్ క్రైమ్ ప్రతినిధి సునిల్ వరంగల్ రూరల్ జిల్లా దామర మండల కేంద్రంలో గల గుట్టల్లో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గత కొంత కాలంగా దామెర గుట్టలలో సర్వేనెంబర్ 368 లో సుమారు మూడు ఎకరాల లవాన పట్టా భూములలో ఈ దందా కొనసాగుతోంది. ప్రతిరోజు పదుల సంఖ్యలో టిప్పర్ లతో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రం నుండి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఈ మట్టి వాహనాల వల్ల రోడ్డుకు ఇరువైపుల ఉన్న ఇండ్లలోనికి వాహనాల ద్వారా వచ్చే దుమ్ము వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని, ప్రజలు వాపోతున్నారు. ఇంత బహిర్గతంగా జరుగుతున్నా పలు శాఖల అధికారులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారో అర్థంకాని పరిస్థితి. సామాన్య ప్రజలకు మొరం కావాలంటే పర్మిషన్ లు కావాలి కానీ, పోలీస్ స్టేషన్ ముందు నుండే ఇంత ఇష్టారాజ్యంగా మట్టి మాఫియా ను కొనసాగిస్తున్న వారికి మాత్రం ఎలాంటి పర్మిషన్ లు అవసరం లేదా అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఈ తవ్వకాలను అరికట్ట వలసిన అధికారులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, దీని వెనుక ఉన్న మతలబు ఏంటి, మట్టిని తరలిస్తున్న మాఫియాకు, అధికారులకు మధ్య ఏమైనా అంతర్గత ఒప్పందం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వీడి అక్రమంగా తరలిస్తున్న మట్టి మాఫియా ను అరికట్టాలని, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు..

468 Total Views, 5 Views Today