AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రపంచ చిత్తడినేలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 2న సైకిల్ యాత్ర

1 min read

AABNEWS వరంగల్ ప్రతినిధి గైని ప్రవీణ్ కుమార్

వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండలోని ఆలయ ఫౌండేషన్ లైబ్రరీ నందు నిర్వహించిన సమావేశంలో జన విజ్ఞాన వేదిక, అటవీశాఖ ,వన సేవాసమితి, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ప్రపంచ చిత్తడినేలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి రెండవ తేదీన వరంగల్ అర్బన్ జిల్లా అటవీశాఖ కార్యాలయము నుండి హసన్పర్తి మండలం సిద్ధాపూర్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ డి ఎఫ్ ఓ పురుషోత్తం గారు పేర్కొన్నారు. కనుక ఒక ప్రకృతి ప్రేమికులు జల సంరక్షణ బాధ్యులు యువకులు విద్యార్థులు వన ప్రేమికులు స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో హాజరై సైకిల్ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా వారు కోరారు ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా బాధ్యులు ప్రకాష్ గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పరికిపండ్ల వేణు గారు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులు నరేష్ గారు పర్యావరణ పరిరక్షణ బాధ్యులు డాక్టర్ సామల శశిధర్ రెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం ఉపాధ్యక్షులు దామోదర్ మరియు జన విజ్ఞాన వేదిక బాధ్యులు పాల్గొన్నారు.

 589 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.