AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రభుత్వ అసమర్థతను,అక్రమాలను ప్రశ్నిస్తే వారిపై కేసులా…

1 min read

AABNEWS : ఈ రోజు మైలవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో జరిగిన మీడియా సమావేశంలో మండల నాయకులు మాట్లాడుతూ,కోవిడ్ నిబంధనలు ఒక్క ప్రతిపక్ష పార్టీ కేనా??అధికార పార్టీకి ఎటువంటి ఆంక్షలు ఉండవా??.మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లుగా ప్రారంభోత్సవాలు, పుట్టినరోజు వేడుకలు చేసుకోవచ్చు వాటికి ఎటువంటి కరోనా ఆంక్షలు వర్తించవు. పోలీసు అధికారులకు ఇవి కనిపించవా???.సరిహద్దు రాళ్లు తొలగించారని,పొజిషన్ చూపించడం లేదని ఒక దళిత మహిళ తమ సమస్య చెప్పుకోడానికి వస్తే ఆ తల్లి పై తప్పుడు కేసులు పెడతారా?ఒక దళిత మహిళ తమ సమస్య చెప్పుకునే హక్కు కూడా లేదా ఈ రాష్ట్రంలో !నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచారు, కరెంటు చార్జీలు పెంచుతున్నారు అసలు ఈ ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నాడు,అని గ్రామాల్లో ప్రజలు తిట్టుకుంటున్నారు.గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మైలవరం నియోజకవర్గంలోని అయ్యప్ప నగర్ లో పేదవాళ్ళుకు ఇళ్ల పట్టాలు ఇస్తే, అక్కడ ఉన్న సరిహద్దు రాళ్లను కొందరు సంఘ విద్రోహశక్తులు తొలగించగా! ఆందోళనకు గురైన లబ్ధిదారులు మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమా గారి దృష్టికి తీసుకువెళ్ళగా, పరిశీలించడానికి వచ్చిన దేవినేని ఉమామహేశ్వరరావు గారిపైన, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన,లబ్ధిదారు అయిన మహిళపైన తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గం.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన వారిని అణగదొక్కాలనే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు ఈ తప్పుడు కేసులు పెట్టించారు అని అన్నారు.
ఈయెక్క కార్యక్రమంలో మైలవరం మండల తెలుగుదేశం పార్టీ ప్రసిడెంట్ తాతా పోతురాజు,మాజీ జడ్పీటీసీ దొండపాటిరాము,టౌన్ తెలుగుదేశం పార్టీ ప్రసిడెంట్ మల్లెల రాధా కృష్ణ,సెక్రటరీ బాలకృష్ణ, సుభాని,మల్లెల దుర్గారావు,లంకా లితిష్,మైక్ బాబురావు,దొండపాటి విజయ్,వెంకట్రావు,bts శ్రీను,అంజి,రమణ,సగ్గుర్తి బాబురావు,రామకృష్ణ,వేమిరెడ్డి కృష్ణారెడ్డి,ప్రభాకర్,తదితరులు పాల్గొన్నారు.

 84 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.