AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రైవేట్ టీచర్ల “మహా ధర్నా”

1 min read

AAB NEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్

ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 20 (ఆదివారం) ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని ఇందిరా పార్కు(ధర్నా చౌక్ ) వద్ద తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్(TPTF) ఆధ్వర్యంలో ప్రైవేట్ టీచర్ల “మహా ధర్నా” కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రైవేట్ పాఠశాలల్లో ,కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు జీతాలు రాక అనేక ఇబ్బందులకు గురౌతున్నరు. గోస పడుతున్న గురువులను ఆదుకోవాలని ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేసినా ఎలాంటి స్పందన రాకపోవడం వలన 20 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మన తోటి ఉపాధ్యాయ మిత్రులకు భరోసా కల్పించడానికి, మన సమస్యల పరిష్కారానికి మనమంతా కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం “మహాధర్నా” కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేద్దాం. ఇప్పటికైనా ఉపాధ్యాయ ,అధ్యాపక మిత్రులు మేల్కొని ఇది మన కోసం జరిగే నిరసన కార్యక్రమంగా భావించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు అధిక సంఖ్యలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు తరలివచ్చి మన ఛైతన్యాన్ని, మన సంఘటిత శక్తిని, మన సమస్యల తీవ్రతను ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిది. ప్రతి ఒక్కరూ మీ యొక్క పోరాట స్ఫూర్తిని ప్రదర్శించి ఉపాధ్యాయులు ఉద్యమిస్తే ఎలా ఉంటుందో నిరూపించండి.✊✊

 126 Total Views,  6 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.