బతుకుదెరువు పోరాటాన్ని విజయవంతం చేద్దాం
1 min read
AABNEWS తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్
ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నీ తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా కన్వీనర్ రత్నం కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అతలాకుతలం చెందింది బతుకు భారమై ప్రైవేటు టీచర్లు నిరుద్యోగులు ఉపాధి లేక జీవితాలను బలిదానం చేసుకుంటున్నారు ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితిలో ఉంది అదేవిధంగా సన్నరకం వడ్లు పెట్టాలని మరియు నియంత్రణ సాగు చేయాలని ప్రభుత్వం ప్రకటించి ఈరోజు కొనుగోలు సెంటర్లను ఎత్తివేసే ధోరణి ఉంది రైతులు ధాన్యాలను ఎక్కడ అమ్ముకోవాలి లో కూడా తెలియని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనుకూల మైనటువంటి పరిపాలన చేయకుండా సొంత లాభం కోసం మాత్రమే పరిపాలన కొనసాగిస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు జనవరి 3,4 తేదీలలో ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నారు ఈ దీక్ష ప్రధానంగా మూడు డిమాండ్లపై నా దీక్ష కొనసాగిస్తున్నారు మొదటగా నిరుద్యోగ భృతి ప్రకటించాలి మరియు ప్రైవేట్ టీచర్ ఆదుకోవాలి
2, ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు తక్షణమే విడుదల చేసి ప్రైవేటు టీచర్లను ప్రైవేటు విద్యాసంస్థలు ఆదుకోవాలి
3, దాన్యం కొనుగోలు సెంటర్లను ఎత్తి వేస్తున్న నటువంటి ఆలోచనను విరమించుకొని యధాతధంగా రైతులు ధాన్యం కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించాలి
ప్రధానంగా ఈ డిమాండ్ పైన దీక్ష కొనసాగిస్తున్నది కావున అత్యధికంగా నిరుద్యోగులు, తెలంగాణ ప్రజానీకం పాల్గొని నిరాహారదీక్షను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం..
ఈ కార్యక్రమంలో లో తెలంగాణ జన సమితి నాయకులు లింగారెడ్డి, మహమ్మద్ హమీద్ మరియు శివరాజ్ , కత్తి అశోక్ ,రమేష్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు
476 Total Views, 2 Views Today