బాలాజీ స్కూల్ లో అంగరంగ వైభవంగా వేడుకలు
1 min read
స్థానిక భూపాలపల్లి పట్టణంలో లో బాలాజీ ఇంటిగ్రేటెడ్ స్కూల్(బిట్స్) భూపాలపల్లి గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా విద్యార్థుల తల్లులను ఆహ్వానించి వారికి ఆటల పోటీలు నిర్వహించి వారికి ఆనందాన్ని పంచడం జరిగింది దీనిలో ప్రతి ఒక్క విద్యార్థి మాత్రుమూర్తి ఆటలలో పాటలలో పాలుపంచుకొని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా గెలిచిన తల్లులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్య అతిథిగా శ్రీమతి శ్రీ బుర్ర సునీత గారు జిల్లా యువజన క్రీడల అధికారి గెలిచిన వారికి బహుమతి ప్రధానం చేయడం జరిగింది అదేవిధంగా వారు మాట్లాడుతూ మహిళల గురించి వారి సాధించిన విషయాల గురించి విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియపరిచారు అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ రాజేష్ కుమార్ గారు మాట్లాడుతూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చైర్మన్ గారి తరుపున తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్కే నదీముద్దీన్, జుబేదా బుర్ర కిరణ్ కుమార్ గౌడ్, చందు రాం, గోపి ,సంతోష్, రాణి ,పవిత్ర, లిడియా మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు
766 Total Views, 2 Views Today