AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బి కే ఆర్ వృద్ధాశ్రమం నాగభైరవ హర్షిత్ జన్మదినోత్సవం…

1 min read

AABNEWS : బి కే ఆర్ వృద్ధాశ్రమం వెల్దిపాడు, అమ్మ చిల్డ్రన్ హోమ్ గన్నవరం లలో నాగభైరవ హర్షిత్ జన్మదినోత్సవం సందర్భంగా వస్త్ర దానం, అన్నదానం గురువారం చి. నాగభైరవ హర్షిత్ జన్మదినోత్సవం సందర్భంగా హర్షిత్ అమ్మమ్మ తాతయ్య గార్లు శ్రీమతి & శ్రీ ముక్కామల సురేంద్ర బాబు, రజిత గార్లు గన్నవరం అమ్మ చిల్డ్రన్ హోమ్ మరియు వెల్దిపాడు బి కే ఆర్ వృద్ధాశ్రమం లో గల అనాధ బాలలకు, వృద్ధులకు అన్నదానం మరియు వస్త్ర దానం చేశారు.ఈ సందర్భంగా ఆశ్రమ చైర్మన్ శ్రీమతి కానూరు శేషు మాధవి మాట్లాడుతూ ఆశ్రమంలో గల అనాధ బాలల, వృద్ధులను ఆదుకోవడం కోసం సేవా హృదయంతో గత సంవత్సర కాలం నుండి మాకు చేదోడు వాదోడుగా ఉండి, చేయూతనందిస్తూ ఈ రోజు మనవడి జన్మదినోత్సవాన్ని అనాధ బాలల వృద్ధుల మధ్య పుట్టినరోజు వేడుకలు నిర్వహించి, బాలలకు వృద్ధులకు అన్నదానం, వస్త్ర దానం చేసిన శ్రీ ముక్కామల సురేంద్రబాబు, శ్రీమతి రజిత గార్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న నాగభైరవ హర్షిత్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, హర్షిత్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ధనధాన్యాలతో అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ భగవంతుని ప్రార్ధిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కే శ్రీనివాసరావు, హంగర్ స్పాట్ రెస్టారెంట్ అధినేత శ్రీ వి వినయ్ కుమార్, బొకినాల అశోక్ మరియు ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.

 719 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.