AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

1 min read


-ప్రతీ పోలింగ్ బూతుల్లో జెండా ఆవిష్కరించాలి.
-బీజేపీ అర్భన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి
భూపాలపల్లి టౌన్, ఎప్రిల్ 05 (ప్రభ న్యూస్) బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భూపాలపల్లి బీజేపీ పట్టణ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి బీజేపీ శ్రేణులను కోరారు. భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ 1980 ఎప్రిల్ 6 న బీజేపీ పార్టీ ఆవిర్భవించిందని ఈ ఆవిర్భావ దినోత్సవము మనందరికీ పండుగ రోజని అన్నారు. మంగళవారం ఉదయం 8 గంటల నుండి అన్ని పోలింగ్ బూతుల్లో 9:30 గంటల వరకు ప్రతి పోలింగ్ బూతులో జెండా ఆవిష్కరణ చేయాలన్నారు. ఈ సందర్బంగా
సీనియర్ నాయకులకు సన్మానం చేయడం, హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేయడం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అన్ని పోలింగ్ బూత్ లలో నిర్వహించాలన్నారు. అనంతరం 10 గంటలకు మండల కేంద్రంలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఉపన్యాసం వినాలని అన్నారు. ఈ నెల 14 న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేటి నుండి 14 వ తేదీ వరకు రక్తదాన శిబిరం ఏర్పాటు, మాస్కుల పంపిణీ, ప్లాస్టిక్ నిర్మూలన, అనాదాశ్రమంలో సేవా కార్యక్రమాలు, వృద్ధులకు సన్మానం, బాటసారులకు దాహార్తిని తీర్చడం వంటి సేవా కార్యక్రమాలు చేయాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, బూత్ అధ్యక్షులను, పట్టణ నాయకులను మహిళా మోర్చా నాయకులను, వివిధ మోర్చా నాయకులను మధుసూదన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి తుమ్మేటి రామ్ రెడ్డి, ఉపాధ్యక్షులు పడకంటి పురుషోత్తం, కోరే సుధాకర్, కార్యదర్శి పున్నం మల్లారెడ్డి, అధికార ప్రతినిధి గోగుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

 865 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.