భగీరథ ఎన్నాళ్ళు ఈ వ్యధ…
1 min read
AABNEWS : పూర్తికాని మిషన్ భగీరథ పనులు
పలు కాలనీలలో తీవ్రమైన నీటి ఎద్దడి
ఆదిలాబాద్ , ఇచ్చోడ :తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు స్వచ్ఛమైన త్రాగు నీటిని అందించడం కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ పనులు నేటికీ పూర్తి కాకపోవడంతో ఇచ్చోడ మండలంలో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ఇచ్చోడలోని ఇస్లాంపుర,రంజాన్ పుర కాలనీలలో మిషన్ భగీరథ పనులు పూర్తి కాక మిషన్ భగీరథ పైపులు అలంకార ప్రాయంగా మారాయి.ఆఫీసర్ల గుత్తేదారుల నిర్లక్ష్యం వలన కేవలం పైపులైన్ పూర్తిచేసి నీటి సరఫరాను మరిచిపోవడం వలన కాలనీ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగు నీరు అందని ద్రాక్షగా మారింది.ఎన్నోసార్లు ఆఫీసర్ల దృష్టికి తీసుకు వెళ్ళిన పనులు పూర్తి కావడం లేదని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నార.కోటలో ప్రజాధనం వృధా అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి త్వరగా పనులు పూర్తి చేసి కాలనీలలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
నీటి ఎద్దడిని తీర్చండి..
ముబారక్,సామాజిక కార్యకర్త,ఇచ్చోడ
మిషన్ భగీరథ పనులు త్వరగా పూర్తిచేసి నీటి ఎద్దడి సమస్యలు తీర్చాలి.స్వచ్ఛమైన తాగునీరు వస్తుందని ఎంతగానో సంతోషించాం కాని నేటికీ మిషన్ భగీరథ పనులు పూర్తి కాక పోవడం శోచనీయం.ఇచ్చోడ లోని ఇస్లాం పుర కాలనీలో మిషన్ భగీరథ పనులు పూర్తి కాక వృధాగా పడి ఉన్న పైపులు. ముబారక్,సామాజిక కార్యకర్త,ఇచ్చోడ
430 Total Views, 2 Views Today