AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

భద్రకాళి ఆలయం లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

1 min read

AAB NEWS

తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి : బుర్ర కిరణ్ కుమార్ గౌడ్


వరంగల్ లో ప్రసిద్ధి గాంచిన భద్రకాళి ఆలయం లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రకాళి ఆలయానికి వచ్చిన కిషన్ రెడ్డి కి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ,పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్. సునీత లు పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు శేషు శర్మ ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గోపూజ చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారి శేష వస్త్రాలు బహుకరించి మహదాశీర్వాదం చేశారు. ఆయన వెంట బిజెపి జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ధర్మారావు, చందుపట్ల కీర్తి రెడ్డి, డాక్టర్ విజయ రామారావు, డాక్టర్ విజయ చందర్ రెడ్డి, నరహరి వేణుగోపాల్ రెడ్డి ,కార్పోరేటర్ స్వాతి, సునీల్, అనిల్, కమల్ తదితరులు పాల్గొన్నారు.

 40 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.