‘కార్తీక’ సందడి…
1 min read
AAB NEWS :
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో సోమవారం ‘కార్తీక’ సందడి నెలకొంది. గోదావరి తీరం భక్తులతో పోటెత్తింది. మహిళలు పవిత్ర మాసంగా భావించే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి గడియలు సోమవారం కూడా ఉండటంతో పూజలతో గోదావరి మాత పరవశించింది. తెల్లవారుజామునుంచే భక్తుల తాకిడి పెరిగింది. పలు ప్రాంతాల నుంచి మహిళలు, భక్తులు తమ కుటుంబ సభ్యులతో భద్రాచలానికి చేరుకొని పవిత్ర గోదావరిలో పుణఃస్నానాలను ఆచరించారు.
అనంతరం నదిలో గౌతమీ మాతకు దీపాలను వదిలి తమ మాంగల్యాలను చల్లగా చూడాలంటూ వేడుకున్నారు. అనంతరం గోదావరి ఒడ్డున ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సామూహిక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని దర్శింకున్నారు.
30 Total Views, 2 Views Today