September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

పాఠాలు చెప్పాల్సిన ప్రధానోపాద్యుడు లైంగికదాడికి పాలుపడ్డాడు…

1 min read

AABNEWS : భద్రాద్రి కొత్తగూడెం : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడే అభం శుభం తెలియని అమాయక చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆన్‌లైన్ పాఠాలు వింటున్నారా? లేదా? అనే విషయం తెలుసుకునేందుకు పాఠశాలలకు అమ్మాయిలను పిలిపించుకుని వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు హెడ్‌మాస్టర్. ఈ ఘటన లక్ష్మీదేవిపల్లి మండంలోని చింతవర్రె గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వెలుగు చూసింది. కరోనా లాక్‌డౌన్‌తో గత నాలుగైదు నెలల నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు మొదలైన విషయం తెలిసిందే. అయితే చింతవర్రె పాఠశాల హెడ్‌మాస్టర్ దొడ్డ సునీల్ రోజు విడిచి రోజు పాఠశాలకు వస్తున్నాడు. ఈ క్రమంలో 2, 3వ తరగతి చదువుతున్న అమ్మాయిలను పాఠశాలకు పిలిపించుకుని.. ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారా? లేదా? అని అడిగేవాడు. అంతటితో ఆగకుండా వారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికదాడికి పాల్పడేవాడు. అలా ఐదు మంది చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. అసలు విషయం వెలుగు చూసింది. దీంతో బాధిత చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులకు, డీఈవోకు ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

బయటకు చెబితే చంపేస్తా: మద్యం మత్తులో పాఠశాలకు వచ్చే హెడ్‌మాస్టర్ సునీల్‌.. అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా.. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో పిల్లలు భయపడి తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోయారు. ఈ అమ్మాయిలే కాదు.. గతంలో పలువురి అమ్మాయిలపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇప్పుడు ఆ బాధిత విద్యార్థినులు కూడా ముందుకు వస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు సునీల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

 234 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.