పెద్ద పులి సంచారం…
1 min read
AABNEWS : హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజల్లో పెద్దపులి భయాందోళను రేకెత్తిస్తోంది. నాలుగు రోజుల క్రితం అన్నపురెడ్డిపల్లికి ఆనుకుని ఉన్న ములకలపల్లి మండలంలోని కుమ్మరిపాడు లో గ్రామస్తుల సమాచారంతో అటవీ అధికారులు గాలించారు. కొన్ని చోట్ల పులి అడుగుజాడల్లో కనుగొన్నారు. రెండు రోజుల క్రితం గుట్టగూడెం పంచాయతీలో పత్తి చేలో పనిచేస్తున్న రైతులు పులిని గుర్తించి భయంతో ఇంటిముఖం పట్టారు. అలాగే నిన్న రాత్రి పాల్వంచ నుంచి కారులో కమలాపురం వస్తున్న స్థానికులు రోడ్డు పై పులిని చూసి స్థానికులకు సమాచారం ఇచ్చారు. మండలంలోని సత్యంపేట, మూకమామిడి, ముత్యాలంపాడు గ్రామాల పరిసరాల్లో పులి సంచరించినట్లు, దాని అడుగుజాడలు గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పెద్దపులి సంచారంతో తోటలు, చేలల్లో పనిచేసే కూలీలు, రైతులు, పశువుల కాపరులు భయాందోళనలకు గురవుతున్నారు.
95 Total Views, 2 Views Today