AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ లో దారుణం…

1 min read

AABNEWS : భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం ఒక మహిళ రాగా వైద్యం అందుబాటులో లేకపోవడంతో భద్రాచలం ఆర్టిసి బస్టాండ్ లో మృతి చెందింది. కొత్తగూడెంకు చెందిన సమ్మయ్య భార్య రమ (60) ఆరోగ్యం బాగా లేక పోవడంతో మూడు గంటలకు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అక్కడి సిబ్బంది ఈ రోజు సమయం అయి పోయింది రేపు ఆదివారం సెలవు, సోమవారం రావాలని చెప్పడంతో చేసేది ఏమీ లేక సమ్మయ్య తన భార్యతో తిరుగు ప్రయాణం అయ్యాడు. భద్రాచలం ఆర్టీసీ బస్టాండ్ కి రాగానే బస్సు ఎక్కే క్రమంలో అతని భార్య రమ మృతి చెందింది. దీంతో బస్సు ఎక్కించుకునేదుకు ఆర్టీసీ సిబ్బంది నిరాకరించారు. దీంతో మృత దేహంతోనే సమ్మయ్య ఆర్టీసీ బస్టాండ్ లో రాత్రంతా పడిగాపులు కాచాడు. వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే తన భార్య మృతి చెందిందని సమ్మయ్య అంటున్నాడు. కనీసం మృతి దేహాన్ని పంపించే బాధ్యత సైతం మరిచారు ఈ పాలకులు గిఫ్ట్ ఏ స్మైల్ అంటు ఫోటోలకు అంబులెన్స్ లకు పోజులు ఇచ్చే నాయకులు ఈ దుర్మార్గం చూడండి… పేరుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా… ఏలేది గులాబీ పాలనాలోని మహబూబాబాద్ పార్లమెంటు… సిగ్గు పడదామా….నాయకులకు భజనలు చేద్దామా…

 113 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.